సునీల్ రెమ్యునరేషన్ పైనే అంతా చర్చ

  • August 25, 2018 / 12:36 PM IST

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతోన్న అరవింద సమేత వీర రాఘవ టీజర్ లో ఒక క్షణంలో సునీల్ కనిపించారు. ఇంకేముంది అతని అభిమానులు మీమ్స్ తో సునీల్ కి వెల్కమ్ చెప్పారు. చిరు నటనని ఎంతమంది ఇష్టపడతారో అంతమందికి సునీల్ కామెడీ అంటే ఇష్టమని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. హాస్య నటుడిగా అంత ఫాలోయింగ్ సంపాయించుకున్నారు. అయితే హీరోగా చేసిన సినిమాలు మొదట్లో హిట్ కావడంతో కమెడియన్ రోల్స్ కి నో చెప్పి .. యాక్షన్ లోకి దిగారు. అప్పుడే కథ అడ్డం తిరిగింది. హీరోగా నటించిన సినిమాలు బోల్తా కొట్టడం మొదలెట్టాయి. అందుకే సునీల్ యు టర్న్ తీసుకున్నారు. మళ్లీ కమెడియన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అమర్‌ అక్బర్‌ ఆంటోనీ లో ఫుల్ లెన్త్ కామెడీ రోల్ చేస్తున్నారు. మాస్ మహారాజ్ తో కలిసి నవ్వులు పూయించడానికి శ్రమిస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవలోను మంచి రోల్ చేస్తున్నారు. హీరోగా ‘సిల్లీ ఫెలోస్’ సినిమా కూడా చేస్తున్నారు. అయితే కమెడియన్ గా చేస్తున్న చిత్రాలు సునీల్ కి పూర్వవైభవాన్ని తెచ్చిపెడుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే కమెడియన్ గా పేరు తెచ్చుకుంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ రోజుకు 3. 5 లక్షలు అందుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే 4 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఇంతమొత్తంలో ఇప్పటి వరకు ఏ కమెడియన్ తీసుకోలేదు. ఆ రికార్డును సునీల్ నెలకొల్పనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus