సునిల్ హీరో నుండి కమెడియన్ అయిపోయాడు అనుకుంటుడగా మళ్లీ హీరోగా సినిమా చేస్తున్నాడని సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుకంర్ ఈ సినిమా నిర్మిస్తున్నారట. అయితే ఈ సినిమాతోనే సునిల్ హీరోయిజం ఆగిపోవడం లేదట. ఈ కాంబినేషన్లోనే మరో సినిమా కూడా ఉండబోతోందని టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల కోలీవుడ్ విడుదలై మంచి విజయం అందుకున్న ఓ కామెడీ సినిమాను సునిల్ ప్రధాన పాత్రలో రూపొందిస్తారని సమాచారం. తమిళ ఇండస్ట్రీలో సెటైరికల్ కామెడీ ఎక్కువగా ఉంటుంది.
పాలిటిక్స్ మీద అలా వచ్చిన చిత్రం ‘మండేలా’. యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమా రీమేక్ హక్కుల్ని అనిల్ సుంకర్ దక్కించుకున్నారట. దానినే ఇప్పుడు సునిల్ హీరోగా తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. కొత్త దర్శకుడు ఈ సినిమా కోసం మోగా ఫోన్ పట్టుకుండాట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అప్పుడు మరిన్ని వివరాలు బయటికొస్తాయి. రాజకీయ వ్యంగ్య చిత్రంగా రూపొందిన ‘మండేలా’లో గ్రామ రాజకీయాలను ప్రస్తావించారు.
ఓ గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలోని ప్రజలంతా రెండు వర్గాలుగా విడిపోతారు. దీంతో మండేలా అనే బార్బర్ ఓటు నిర్ణయాత్మకంగా మారుతుంది. మండేలా ఓటు కోసం ఇరు వర్గాలు కుయుక్తులు పన్నడం, దాని కోసం వారు చేసే పనులు లాంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమాను తమిళనాట స్టార్ విజయ్ టీవీ డైరెక్టుగా విడుదల చేసింది. దాంతోపాటు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. రెండు చోట్లా మంచి స్పందన వస్తోంది.