Sunil, Mahesh Babu: మహేష్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సునీల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో మొదలుకానుందని ఈ సినిమా కూడా వచ్చే ఏడాదే రిలీజ్ కానుందని బోగట్టా. సర్జరీ వల్ల ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ వచ్చే నెల నుంచి మళ్లీ షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం. తాజాగా సునీల్ మహేష్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పుష్ప ది రైజ్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఈ సినిమాతో సునీల్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ మహేష్ బాబు చూడటానికి క్యూట్ గా యంగ్ జేమ్స్ బాండ్ లా ఉంటాడని అన్నారు. అయితే మహేష్ బాబు గొడ్డ కష్టం పడతారని ఫైట్ సీన్లలో మహేష్ ను డైరెక్టర్లు మూడు నాలుగు ఫ్లోర్స్ నుంచి వేలాడదీస్తారని సునీల్ చెప్పుకొచ్చారు.

ఆ సీన్లు చేసి సమయంలో గొడ్డే అని సీన్ పూర్తయ్యే వరకు మహేష్ ఎంతో కష్టపడతారని సునీల్ కామెంట్లు చేశారు. దర్శకుడిని నమ్మితే మహేష్ బాబు లైఫ్ ఇచ్చేస్తాడని అదే మహేష్ బాబులో తనకు నచ్చే గుణం అని సునీల్ చెప్పుకొచ్చారు. మహేష్ బాబు కౌంటర్, ఫన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సునీల్ అన్నారు. మహేష్ గురించి పాజిటివ్ గా సునీల్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైట్ సీన్లను సొంతంగా చేయడానికే ఇష్టపడతారు. రిస్కీ సీన్లు అయినా మహేష్ బాబు డూప్ లతో ఆ సీన్లను డైరెక్టర్లు తెరకెక్కించడానికి అస్సలు ఇష్టపడరు. మహేష్ బాబు దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారనే సంగతి తెలిసిందే. వివాదాలకు కూడా మహేష్ దూరంగా ఉంటారు. సర్కారు వారి పాట మినహా మహేష్ భవిష్యత్తు ప్రాజెక్టులు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus