కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న కమెడియన్ల జాబితాలో నిలిచాడు సునీల్. తనదైన శైలి కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. కమెడియన్ గా మొదట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పలు చిత్రాలలో హీరోగా కూడా నటించి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కానీ హీరోగా సెట్ కాకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. తాను ఏ పాత్రనైనా చేయగలనంటూ విలన్ రోల్స్ పోషిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఇటీవల చాలా సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన విరూపాక్ష, పుష్ప వంటి చిత్రాలలో సునీల్ నెగటివ్ పాత్రలో నటించి మెప్పించారు. కమెడియన్ గా సునీల్ ని ప్రస్తుతం చూడలేకపోయినా విలన్ గా ఒప్పిస్తున్నారని అభిమానులు మాత్రం పొగిడేస్తున్నారు. అదేంటో కానీ తెలుగు వాడైన సునీల్ ఇప్పుడు టాలీవుడ్ లో కంటే కోలీవుడ్లో ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నారు.
అది కూడా కమెడియన్ గా కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పలు రకాల పాత్రలు వస్తున్నట్లు సమాచారం. తెలుగు తమిళం భాషలలో ఆయన నటించాలని అక్కడ చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రజనీకాంత్ – జైలర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు సునీల్.. ఈ పాత్రకు సునీల్ వందశాతం న్యాయం చేశారని దీంతో తమిళ తంబీలు ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీంతో కోలీవుడ్లో ఎక్కువ సినిమాల్లో తనను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విశేషం ఏంటంటే.. జైలర్ మూవీలో సునీల్ (Sunil) పాత్ర ప్రేక్షకులను బాగా ఫిదా చేసినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎందుకో నచ్చలేదట.. కానీ తమిళ ప్రేక్షకులకు నచ్చడంతో సునీల్ కష్టం వృధా కాలేదని అనుకుంటున్నారు.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?