‘చిరునవ్వు’ సినిమా తో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి,కమెడియన్ గా,సహా నటుడిగా,హీరోగా, ఇలా అన్ని రకాల పాత్రలతో మెప్పిచిన హీరో సునీల్ తాజా గా,దర్సకుసు వాసు వర్మ,దర్సకత్వం లో రూపొందుతున్న ‘కృష్ణాష్టమి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఈ నెల 18 న విడుదల కాబోతున్న విషయం విదితమే.ఈ సందర్బంగా ఆయన తన సినీ ప్రయాణాన్ని ఒక సారి నెమరువేసుకున్నారు.డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రత్యేక అనుబంధం ఉందని,అతను నేను కలిసి పంజాగుట్ట లో ఒకే రూం లో ఉండేవాళ్లమని,అప్పుడున్న పాత డొక్కు స్కూటర్ మీద తిరిగినప్పుడు చాల తృప్తిగా అనిపించిందని,ఇప్పుడు కార్లలో తిరుగుతున్నా అటువంటి ఆనందం దొరకడం లేదని ఆ జ్ఞాపకాలు మరపురానివని,తెలిపారు
కొత్త కమెడియన్స్ అందరికి త్రివిక్రమ్ లాంటి వాళ్ళు దొరకాలని అప్పుడే కమెడియన్స్ టాలెంట్ తెలుస్తుందని అన్నారు.కమెడియన్ నుండి హీరో గా అయినప్పుడు చాలామంది కెరీర్ నాశనం చేసుకుంటున్నాడని గుసగుసలాడుకున్నారని,ఆయిన ఇటువంటి విమర్శల్ని పట్టించుకోనని,కొంతమంది కమెడియన్ గా నా స్థానాన్ని భర్తీ ఎవరు చెయ్యలేకపోతున్నారని అంటున్నారని,కాని ఇండస్ట్రీ లో చాలామంది మంచి కమెడియన్స్ ఉన్నారని,’వంద చేపలు పట్టివడం కన్నా ఒక చేప పట్టడం నేర్పు’ అన్న త్రివిక్రమ్ మాటలు ఎప్పటికి మర్చిపోలేనని తన మాటల్లో చెప్పాడు.