Sunil: ఎన్టీఆర్, మహేష్ సినిమాల్లో సునీల్!

కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోగా మారి ఎన్నో సినిమాలు చేశారు సునీల్. అయితే హీరోగా అతడికి సక్సెస్ రేట్ పెద్దగా లేదు. ఎంత కష్టపడినా.. సోలో హీరోగా నిలబడలేకపోయారు. దీంతో తిరిగి తనకు కామెడీ రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అలానే విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. అతడు విలన్ రోల్ పోషించిన ‘కలర్ ఫొటో’కి నేషనల్ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో సునీల్ రోల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కోలీవుడ్ ఆడియన్స్ కి అయితే సునీల్ బాగా నచ్చదు. అందుకే శంకర్ కూడా రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో సునీల్ ని తీసుకున్నారు. అలానే కొందరు తమిళ దర్శకుడు సునీల్ ని అప్రోచ్ అయి తన సినిమాల్లో ఆన్ బోర్డ్ చేసుకున్నారు. ప్రస్తుతం సునీల్ చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. వారంలో నాలుగు రోజులు చెన్నైలోనే ఉంటున్నారు సునీల్. ఇదిలా ఉండగా.. సునీల్ బెస్ట్ ఫ్రెండ్, దర్శకుడు త్రివిక్రమ్..

మహేష్ బాబుతో సినిమా మొదలుపెడుతోన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల్లో సునీల్ నటించారు. అందులో అతడి క్యారెక్టర్స్ కూడా బాగా పండాయి. అందుకే మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేయబోతున్నారు. అయితే త్రివిక్రమ్ సినిమాలో సునీల్ క్యారెక్టర్ ఏంటి..? ఎలా వుండబోతుందనే విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఇప్పుడు సునీల్ కి మరో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కూడా సునీల్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సునీల్ కోసం ఓ స్పెషల్ రోల్ రాసుకున్నారట. ఈ రెండు కాకుండా ‘పుష్ప2’, ‘హరిహర వీరమల్లు’ సినిమాల్లో కూడా కనిపించనున్నారు సునీల్.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus