పవన్, బన్నీ వాస్ ల పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సునీత బోయ

గతంలో ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ తనకు 500 వందల రూపాయలు ‘పేటియం’ చేసాడనే కామెంట్ చేసి పెద్ద పాపులర్ అయిన జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆమె ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, జనసేన పార్టీ అధినేతలు తనను మోసం చేసారంటూ ఆరోపణలు చేస్తూ నిరసనకు దిగింది. గొలుసులతో తనని బంధించుకుని ఫిల్మ్ చాంబర్‌లో మంగళవారం రాత్రంతా నిరసన చేసింది.

అసలు విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది.ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ” ‘గీతాఆర్ట్స్’ లో చేయబోయే సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి నిర్మాత బన్నీ వాసు నన్ను మోసం చేశాడు. జనసేన పార్టీ కోసం కష్టపడితే ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు నా పైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నాకు జరిగిన అన్యాయం పై అల్లు అరవింద్ స్పందించాలి. ఈ విషయాన్నీ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్లాలనేదే నా ఉద్దేశం. నన్ను తీసుకెళ్తే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు, కాబట్టి నాకు సపోర్ట్ చెయ్యండి” అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. మరి సునీత చేస్తున్న ఆరోపణల్లో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus