Sunny, Kajal: కాజల్ చేసిన ఆ పనివల్లే సన్నీ విన్నర్ అవుతున్నాడా..?

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఈసీజన్ లో ఆఖరి వారం బ్యాటిల్ లో విన్నర్ ఎవరు అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ నుంచీ కూడా షణ్ముక్ కి సోషల్ మీడియాలో హ్యూజ్ గా పోలింగ్ అనేది జరుగుతూ వచ్చింది. అయితే, మొదట్లో చాలావారాలు షణ్ముక్ జస్వంత్ నామినేషన్స్ లోకి రాలేదు. దాంతో సన్నీకి మెల్లగా ఓటింగ్ అనేది పెరుగుతూ వచ్చింది. కొన్నివారాల పాటు సేఫ్ అయిన సన్నీ ప్రియా టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా తన గ్రాఫ్ ని పెంచుకున్నాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కత్తులు గుచ్చుతూ ఆడిన కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్ అవ్వకపోయినా కూడా తనపై సింపతీ మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది.

ఇక్కడే కాజల్ నీకు కత్తులు దింపుతుంటే చూడలేకపోతున్నా అంటూ సన్నీకి సపోర్టింగ్ గా మాట్లాడింది. ఇక్కడ్నుంచీ సన్నీ గ్రాఫ్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చింది. ఇక కెప్టెన్సీ టవర్ టాస్క్ లో సిరితో , షణ్ముక్ తో జరిగిన గొడవలో సన్నీ రెచ్చిపోయి మరీ అరిచాడు. వెనక్కి పడితే అప్పడం అయిపోతావ్ అంటూ మాట్లాడేసరికి హైలెట్ అయ్యాడు. ఆ తర్వాత వీకండ్ లో నాగార్జున ఈ ఇష్యూని తీస్కుని వచ్చి సన్నీకి ఫుల్ క్లాస్ పీకాడు. తంతాను అనడం, అప్పడం అనడం, అమ్మేస్తా అనడం తప్పు సన్నీ అంటూ హెచ్చరించాడు.

ఈ వీకెండ్ ఎపిసోడ్ లోనే కాజల్ సన్నీవైపు ధైర్యంగా నిలబడి హోస్ట్ ని సైతం ఎదిరించి అది సన్నీ కావాలని అనలేదని నిరూపించింది. అక్కడే ఉన్న అనీమాస్టర్ కూడా సన్నీకి సపోర్టింగ్ గా మాట్లాడింది. దీంతో కాజల్ ఇచ్చిన బూస్టప్ తో సన్నీకి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. సిరి, షణ్ముక్ ల ఆటతీరు నచ్చకపోవడం అదే టైమ్ లో సన్నీ వాళ్లపై అరవడం అనేది జనాల్లో అతనికి క్రేజ్ ని తీస్కుని వచ్చింది. ఇక్కడ తప్పెవరిది అనేది వదిలేసినా సన్నీకి మాత్రం ఫ్యాన్స్ ఎక్కువైపోయారు.

హోస్ట్ నాగార్జునపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చేంతగా సన్నీకి క్రేజ్ పెరిగిపోయింది. దీంతో సన్నీ ఇప్పుడు విన్నర్ రేస్ లో నిలబడ్డాడు. ఈవారం నామినేషన్స్ లో కూడా షణ్ముక్ ని దాటి ముందుకు వెళ్తున్నాడు. ఇలాగే మరోవారం కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా విన్నర్ సన్నీనే అవుతాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సన్నీకి తప్ప ఈసీజన్ ట్రోఫీ ఎవరికి ఇచ్చినా కూడా వేస్ట్ అనే అంటున్నారు నెటిజన్స్. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus