మీనా కుమారి బయో పిక్ లో సన్నీలియోన్!

ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తోంది. క్రీడాకారుల జీవిత గాధలకే కాదు.. సినీ నటీనటుల నిజ జీవితాలపై తెరకెక్కే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. సిల్క్ స్మిత రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ హిట్ కావడంతో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తొలితరం హీరోయిన్ మీనా కుమారి జీవితం ఆధారంగా దర్శకుడు కరణ్ జార్దన్ చిత్రాన్ని రూపొందించడానికి గత కొంతకాలంగా శ్రమిస్తున్నారు. ఏడాది క్రితమే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన అతను లీడ్ రోల్ పోషించమని విద్యాబాలన్, రాణి ముఖర్జీలను సంప్రదించి విఫలమయ్యారు. మీనా కుమారి తాగుడుకు బానిసై మరణించారు.

అందుకే ఆ పాత్ర చేయడానికి వారు నిరాకరించారు. కానీ మీనా కుమారిగా నటించడానికి సన్నీ లియోన్ ఎటువంటి అభ్యన్తరం చెప్పలేదని డైరక్టర్ తెలిపారు. స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఓకే చెప్పారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన రోల్ కి ఆర్టిస్ట్ ఎంపిక కావడంతో ఈ చిత్ర పనులు వేగవంతమవుతాయని దర్శకుడు కరణ్ జార్దన్ వెల్లడించారు. సన్నీ లియోన్ కి బాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాది లోను బాగా క్రేజ్ ఉంది. రీసెంట్ గా సన్నీ తెలుగులో చేసిన డియ్యో డియ్యో ఐటెం సాంగ్ గరుడ వేగా సినిమాకి ప్లస్ అయింది. అందుకే ఆమె లీడ్ రోల్ పోషించే సినిమా నాలుగు భాషల్లో విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus