తన జీవితంలో చీకటి కోణాలను బయటపెట్టనున్న సన్నీ

పోర్న్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సన్నీ లియోన్‌ బిగ్‌బాస్‌ షో పాపులారిటితో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెకు అవమానాలు ఎదురయ్యాయి. అయితే భారత్‌కు రావడంతోనే తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారనడంలో కొంతమేరకే నిజం ఉందని సన్నీ చెప్పింది. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌కు వచ్చినప్పుడు కాదు 21 ఏళ్ల వయసులోనే ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పటి నుంచే జనాలు నన్ను అసహ్యించుకుంటున్నట్లు మెయిల్స్ వస్తున్నాయి నా కుటుంబం మద్దతు, సహకారంతో ఎంతో మారాను. ప్రస్తుతం నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ప్రతి కుటుంబంలో ఉన్నట్లుగానే నా ఫ్యామిలీలోనూ ఉన్నాయి. ప్రేమ, అసహ్యం, భావోద్వేగాలు అందరి జీవితాల్లో ఉంటాయి.

నన్ను, నా సోదరుడిని మా అమ్మానాన్నలు కంటికిరెప్పలా చూసుకున్నారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నానని అలాంటివి తట్టుకోవాలంటే ఎంతో మనోనిబ్బరం ఉండాలి. నా పిల్లలకు ఇలాంటి బాధలు పడకూడదు. వారు అవమానాల బారిన పడొద్దని కోరుకుంటున్నానంటూ’ భావోద్వేగానికి లోనై నటి సన్నీలియోన్ ఏడ్చేసింది. ఈ విషయాలను తన బయోపిక్‌ ‘కరన్‌జీత్ కౌర్- ద అన్‌టోల్డ్ స్టోరీ’లో చూస్తే అర్థమవుతుంది. మధ్యతరగి సిక్కు కుటుంబానికి చెందిన కరన్‌జీత్ కౌర్ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌గా ఎలా మారిందన్న అంశాలలను మూవీలో ప్రస్తావించినట్లు సన్నీ వివరించింది. బయోపిక్ సినిమాలా కాకుండా వెబ్‌సిరీస్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె అసలు పేరైన ‘కరణ్‌జీత్‌’ పేరుతోనే ఈ వెబ్‌సిరీస్‌ను జీ5 వెబ్‌ఫ్లాట్‌ఫాం రిలీజ్‌ చేయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus