Bigg Boss 5 Telugu: సిరి చేసిన పనికే హౌస్ లో అంత గొడవ జరిగిందా..?

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం కెప్టెన్సీ టాస్క్ పెద్ద దుమారమే లేపింది. టవర్ లో ఉంది పవర్ అనే టాస్క్ లో హౌస్ మేట్స్ తమలోని పవర్ ని చూపించారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ తమ ఫ్రస్టేషన్ ని తీర్చుకున్నారు. ఈ టాస్క్ లో సిరి, కాజల్, సన్నీ ఇంకా రవిలు పార్టిసిపేట్ చేశారు. కెప్టెన్సీగా అర్హత నేరుగా సాధించిన రవి, అతిథుల టీమ్ నుంచీ సిరి, కాజల్, సన్నీలు అర్హతని సాధించారు. ఇందులో ఫస్ట్ లెవల్ లో ఓడిపోయిన కాజల్, రవికి సపోర్ట్ చేస్తున్న అనీమాస్టర్ దగ్గరకి వెళ్లి చక్కిలిగిలి పెట్టింది. దీంతో వీరిద్దరికీ ఆర్గ్యుమెంట్ అయ్యింది.

ఇంతలోనే సిరి వచ్చి సన్నీని బంతులు విసరకుండా లాక్ చేసే ప్రయత్నం చేసింది. విడిపించుకోవడానికి చూసిన సన్నీ సిరిపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. నన్ను పట్టుకోవడం కాదు, సపోర్ట్ చేసేవాళ్లని పట్టుకోమని సలహా ఇచ్చాడు. నా గేమ్ నాకు తెలుసు అంటూ సిరి కౌంటర్ వేసింది. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. దీంతో నా జోలికి వస్తే తంతా అంటూ సన్నీ హెచ్చరించాడు. తంతావా.. ఛా అంటూ సిరి మాటకి మాట చెప్పింది. నేను టవర్ ని తంతా ఎంతసేపు నాకు అంటూ మాట మార్చాడు సన్నీ. వీరిద్దరి మధ్యనా గట్టి యుద్ధమే జరిగింది. నేను వెనక్కి తోసేస్తే ఏమవుతావ్ అప్పడం అయిపోతావ్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

ఇక్కడ్నుంచీ అప్పడం లొల్లి స్టార్ట్ అయ్యింది. షణ్ముక్ జస్వంత్ దమ్ముంటే చేయి, అప్పడం చేయి అంటూ సన్నీపై విరుచుకుపడ్డాడు. నా ఫ్రెండ్ ని అంటే మద్యలో వచ్చి మాట్లాడతా అంటూ రెచ్చిపోయాడు. మధ్యలో వచ్చిన షణ్ముక్ ఏదీ తన్ను చూద్దాం.. అప్పడం చేయి చూద్దాం అంటూ సన్నీని రెచ్చగొట్టారు. సిరి, షణ్ను ఒకరి కోసం ఒకరు సపోర్ట్‌ చేసుకుంటూ ఇద్దరూ కలిసి సన్నీ మీదకు మాటల తూటాలని విసిరారు. రెచ్చిపోయిన సన్నీ కూడా మాటలు విసిరేశాడు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతున్నావ్‌ అంటూ మాట్లాడాడు. దీనికి సిరికి, షణ్ముక్ కి మరింత కోపం వచ్చింది. అలా ఎలా అంటావ్‌? అని సిరి సన్నీని ఏకిపారేసింది.

సన్నీ కూడా ఆవేశంలో మాటలు తూలాడు కానీ నాగ్‌కు ఇచ్చిన మాట కోసం ఎవరికీ వేలు చూపించటం లేదని, లేదంటే వేరేలా ఉండేదని మాట్లాడాడు. ఇక్కడే షణ్ముక్ నాకు యూట్యూబ్ లో కామెంట్స్ చూసేవాడ్ని నువ్వు అనే మాటలు ఎక్కువేం కాదు అంటూ మాట్లాడాడు. దీంతో సన్నీ నువ్వు అక్కడివరకే తెలుస్తుందిలే అనేసిరికి ఇద్దరికీ ఇంకా కోపం వచ్చింది. ఇద్దరూ సన్నీని రెచ్చగొడుతూనే ఉన్నారు. ఈ గొడవలో ఇద్దరిదీ తప్పుంది. ఇద్దరూ మాటలు తూలారు. ఒకరినొకరు మాటలు అనేసుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంతా అనేవరకూ వచ్చారు. సిరి సన్నీని పట్టుకున్నప్పుడు ఆటని వదిలేసి నువ్వు చేసింది తప్పుని చెప్తే సరిపోతుంది. అది గొడవలాగా క్రియేట్ అయిపోయింది. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus