బిగ్ బాస్ హౌస్ లో ఆఖరివారం సిరికి ఇంకా సన్నీకి మద్యలో గొడవ అనేది పెద్దదిగా మారింది. సరదాగా టాస్క్ లు ఆడేటపుడు చిన్న గొడవలో కారణంగా చిలికి చిలికి గాలివానగా అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకూ జరిగిన టాస్క్ లలో కొన్నింటిని హౌస్ మేట్స్ తో ఆడించాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా బెలూన్ బ్లాస్టింగ్ టాస్క్, టైమ్ కౌంటింగ్, స్మిమ్మింగ్ పూల్ లో టీషర్ట్స్ టాస్క్ లని పెట్టారు. ఇక్కడే సరదాగా పార్టిసిపెంట్స్ సన్నీని ఏడిపిస్తూ లేబుల్ లేదు మచ్చా అంటూ ఫన్ చేశారు.
ఆ తర్వాత రోప్ టాస్క్ ని పెట్టాడు బిగ్ బాస్. చేతులని ఆడిస్తూ రోప్ వేవ్స్ వచ్చేలాగా ఆడాలి. ఇది శ్రీరామ్ అండ్ మానస్ నిజంగా టాస్క్ లో ఆడారు కాబట్టి, సిరి ఇంకా షణ్ముక్, సన్నీలు టాస్క్ ఆడారు. ఇక్కడే ఫస్ట్ సిరి చేతులు నొప్పిగా అనిపించి రోప్స్ ని వదిలేసింది. ముందునుంచీ సన్నీ రోప్స్ ని మెల్లగా కదుపుతుంటే సంచాలక్ గా ఉన్న మానస్ అండ్ శ్రీరామ్ ఇద్దరూ కూడా వేవ్స్ రావట్లేదని చెప్పారు. ఇది ఆసరాగా తీసుకుని సిరి కూడా సన్నీ వేవ్స్ రావట్లేదు అంటూ టాస్క్ ఆడేటపుడు మాట్లాడింది.
దీంతో సరదాగా ఆడే టాస్క్ సీరియస్ గా మారింది. ఫైనల్ గా షణ్ముక్ ఓడిపోయి సన్నీ గెలిచాడు. ఇక్కడే జోక్ గా సన్నీమాట్లాడుతూ నువ్వు ఓడిపోయావ్ అన్నాడు. దీనికి సిరికి కాలింది. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే తీస్కోవు కానీ, మేము తీసుకోవాలా ? నేను ఓడిపోయా అని ఎలా అంటావ్ అంటూ ఆర్గ్యూమెంట్ కి దిగింది. అంతేకాదు, మాటకి మాట ఇద్దరూ పెంచుకుంటూ అరుచుకున్నారు. జోక్ గా అన్నాను మచ్చా అన్నా కూడా సిరి దాన్ని సీరియస్ గా తీస్కుంది. బెలూన్స్ టాస్క్ లో కూడా ఇలాగే మాట్లాడావ్ అని రెచ్చిపోయింది.
ఇక హౌస్ లోకి పిజ్జా రాగానే పిజ్జా తిందాం రమ్మని సన్నీ పిలిచాడు. అయినా కూడా రాలేదు. నువ్వు మాటలు అనేసి ఇప్పుడు పిజ్జా తినడానికి రా అని పిలిస్తే రావాలా ? అంటూ సిరి రెచ్చిపోయి మరీ సన్నీపై విరుచుకుపడింది. సన్నీ కూడా సిరికి సాలిడ్ పంచ్ లు ఇస్తూనే ఉన్నాడు. దీంతో నువ్వేమనుకుంటున్నావ్ సన్నీ నువ్వేమన్నా పెద్ద హీరోవా అంటూ అరిచింది సిరి. దీనికి సన్నీ బాగా హర్ట్ అయ్యాడు. ఆఖరివారంలో కూడా నాపైన ఎందుకిలా మాట్లాడుతున్నారు అంటూ ఫీల్ అయ్యాడు.
చిన్నగా స్టార్ట్ అయిన ఈ ఆర్గ్యూమెంట్ సిరి బరెస్ట్ అవ్వడం వల్ల పెద్దగా అయ్యింది. జోక్ గా అంటున్నా అని సన్నీ చెప్పినా కూడా సిరి తీస్కోలేకపోయింది. సన్నీ కాంప్రమైజ్ కి వచ్చి మాట్లాడుతున్నా కూడా పోట్లాట పెట్టుకుంది. దీంతో ఆఖరివారంలో మరోసారి ఇద్దరికీ గొడవలు జరిగాయి. అయితే, సిరికి షణ్ముక్ ఓడిపోయాడాని ఫీలింగ్ బాగా ఉందని, అతను ఫినాలే అప్పుడు కూడా ఓడిపోతున్నాడని తెలిసి సిరి కావాలనే గొడవ పెట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు కొందరు బిగ్ బాస్ వ్యూవర్స్. అదీ మేటర్.
[yop_poll id=”7″]
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!