ఈవారం టాస్క్ లో సూపర్ పెర్ఫామెన్స్ ఇచ్చింది వీళ్లేనా ?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈవారం టాస్క్ రసవత్తరంగా సాగిందనే చెప్పాలి. హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ సీజన్ 4లో రోబో టాస్క్ ని తలపించింది. అప్పుుడు రోబోలు బ్రతికి ఉండి ఛార్జింగ్ ని నింపుకుంటే టాస్క్ గెలిచినట్లే అయితే, ఇక్కడ కూాడ ఛార్జింగ్ పాయంట్స్ సంపాదించి ఏలియన్స్ స్పేస్ షిప్ నుంచీ టేకాప్ అయితే గెలిచినట్లే. కానీ, ఈ టాస్క్ లో ఏలియన్స్ ఓడిపోయారు. కేవలం ఒకే ఒక్క ఛార్జింగ్ పాయింట్ ని నిలుపుకున్నారు. దీంతో గేమ్ లో నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది.

Click Here To Watch NOW

నిజానికి నటరాజ్ మాస్టర్, అజయ్ గేమ్ లో నుంచీ అవుట్ అయిపోనపుడే ఏలియన్స్ ఓడిపోయారని హ్యూమన్స్ డిసైడ్ అయ్యారు. కానీ, బిందు, అరియానా, హమీదాలు చివరకి వరకూ హోప్ వదల్లేదు. అద్భుతంగా టాస్క్ లో పోరాడారు. ముఖ్యంగా హమీదా రెచ్చిపోయి మరీ టాస్క్ ఆడింది. మిత్రా శర్మా చేతికి పెయింట్ పూసి ఒక ఛార్జింగ్ పాయింట్ ని తీస్కుని వచ్చింది. కానీ, ఇంకో చేతికి మాత్రం పూయలేకపోయారు. చాలాసేపు జంట్స్ తో కూడా కలియబడి మరీ గేమ్ ఆడారు. వాళ్లని ఎక్కడా ఊపిరి తీస్కోనివ్వకుండా టాస్క్ లో ఉక్కిరిబిక్కిరి చేశారు.

హ్యూమన్స్ గెలిచినా కూడా వాళ్లలో జెన్యూనిటీ మిస్ అయ్యింది. ముఖ్యంగా అషూరెడ్డి ప్రారంభంలోనే గేమ్ నుంచీ అవుట్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ కేవలం లైఫ్ బాల్ తీస్కోవడంలో మాత్రమే అషూ సాయం చేయచ్చని చెప్పాడు. కానీ, అషూ బిందుని ప్రొటక్ట్ చేస్తూ టైమ్ వేస్ట్ చేసింది. అలాగే, స్మిమ్మింగ్ పూల్ లో మిత్రాశర్మాని కాపాడేందుకు నీళ్లని ఏలియన్స్ పై పోసింది. దీంతో మైక్ ఖరాబయ్యింది. బిగ్ బాస్ అషూకి పనిష్మెంట్ ఇచ్చాడు. టాస్క్ అయ్యేవరకూ మైక్ ధరించద్దని వార్నింగ్ ఇచ్చాడు.

ఆ తర్వాత గేమ్ లో కన్ఫూజన్ వచ్చి సంచాలక్ అయిన బాబాభాస్కర్ చాలాసేపు గేమ్ ని పాజ్ చేశారు. అరియానా, బాబాబాస్కర్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత గేమ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. అయితే, ఇక్కడ ఏలియన్స్ గేమ్ లో పోరాటం క్లియర్ గా కనిపించింది. హ్యూమన్స్ నుంచీ లైఫ్ బాల్స్ ని కాపాడుకోవడంలో కానీ, అలాగే చేతులకి పెయింట్ పూయడంలో కనబర్చిన సిన్సియారిటీ చాలా బాగుంది. దెబ్బలు తగులుతున్నా కూడా ఎక్కడా కంప్లైట్ చేయకుండా టాస్క్ ని ఫినిష్ చేశారు.

హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్ టాస్క్ లో హ్యూమన్స్ గెలిచినా కూడా ఏలియన్స్ మాత్రం చాలా బాగా పోరాడారు. ముఖ్యంగా అరియానా, హమీదా, బిందు ముగ్గురూ కూడా సూపర్ పెర్ఫామన్స్ ఇచ్చారనే చెప్పాలి. అలాగే, హ్యూమన్స్ లో మాత్రం అఖిల్ డామినేషన్ కనిపించింది. శివ కొద్దిసేపు పోరాడినా కూడా అఖిల్ మాత్రం టాస్క్ లో బెస్ట్ ఇచ్చాడు. వీళ్ల నలుగురు ఈ టాస్క్ లో బెస్ట్ పెర్ఫామ్ చేశారనే చెప్పాలి.

ఇక వీకండ్ నాగార్జున ఖచ్చితంగా గేమ్ ని వేరేవిధంగా ఆడిన వారికి క్లాస్ పీకుతారు. సంచాలక్ అయిన బాబాభాస్కర్ కి కూడా కొద్దిగా క్లాస్ పడే అవాశం ఉంది. ఇక టాస్క్ లో బాగా ఆడిన హ్యుమన్స్ నుంచీ నలుగురు, సంచాల్ అయిన బాబాబాస్కర్ కెప్టెన్సీ పోటీదారులకి అర్హతని సంపాదించారు. మరి వీరిలో కెప్టెన్ ఎవరు అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus