సూపర్ స్టార్ రజనీకాంత్ కు (Rajinikanth) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్టోబర్ నెల 10వ తేదీన రజనీకాంత్ వేట్టయాన్ (Vettaiyan) మూవీ థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా రానా (Rana) నటిస్తుండటం రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధించడం కూడా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.
అయితే రజనీకాంత్ తాజాగా చేసిన ఒక మంచి పని వల్ల సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగుతోంది. పేద విద్యార్థుల కోసం రజనీకాంత్ 12 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వేలూరు జిల్లాకు చెందిన 17 మంది విద్యార్థులు ట్యూషన్ ఫీజును చెల్లించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రజనీకాంత్ దృష్టికి రావడంతో ఆయన వేగంగా స్పందించారు.
వేలూరు జిల్లా రజనీకాంత్ అభిమాన స్వచ్ఛంద మండలి రజనీకాంత్ చేసిన సహాయాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలియజేయడం గమనార్హం. రజనీకాంత్ తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. రజనీకాంత్ కథ అద్భుతంగా ఉంటే టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి కూడా ఆసక్తి కనబరుస్తున్నారని భోగట్టా.
కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సహాయం చేసే మంచి మనస్సు కొంతమందికి మాత్రమే ఉంటుందని అలా సాయం చేసే మనస్సు ఉన్న హీరోలలో రజనీకాంత్ ఒకరని చెప్పవచ్చు. వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా రజనీకాంత్ మాత్రం సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. రజనీకాంత్ మల్టీస్టారర్స్ లో నటించాలని కొంతమంది ఫ్యాన్స్ సూచిస్తున్నారు. జైలర్ (Jailer) సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది.