స్టార్ హీరోలు సినిమాలలోకి రావడం అనేది పాత ట్రెండే. ఒక హీరో స్టార్ డమ్ పీక్స్ చేరిన తరువాత ఫ్యాన్స్ ఓ కోరిక కోరుకుంటారు. తమ హీరో రాజకీయాలలోకి వచ్చి సీఎం అవ్వాలని కాంక్షిస్తారు. అదే తమ హీరో సాధించే అతిపెద్ద విజయంగా ఫ్యాన్స్ భావిస్తారు. ఈ ట్రెండ్ లో సక్సెస్ అయినవారు అతి తక్కువమందైతే, ఫెయిల్ అయినవారు అనేక మంది ఉన్నారు. తమిళనాడులో ఈ ట్రెండ్ మరీ ఎక్కువ.
కమల్ హాసన్ ఆల్రెడీ పాలిటిక్స్ తో దిగిపోగా, రజని వస్తున్నానని ప్రకటించడం జరిగింది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ ఉంది తలపతి విజయ్. కోలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ రాజకీయాలలోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. ఇక రెండు రోజులుగా కోలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. విజయ్ తండ్రి గారైన చంద్ర శేఖర్ కొత్త పార్టీ ప్రయత్నాలలో ఉన్నారట. ఆయన ఓ పార్టీని రిజిస్టర్ చేయించేందుకు సిద్ధం అవుతున్నారట.
దీనికపై ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ లాయర్ తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అన్నీ కుదిరితే 2021 జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పోటీ చేయడం ఖాయం అంటున్నారు. మరి ఈ వార్తలలో నిజం ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాలలో అనిశ్చితి నెలకొంది. రాజకీయ ఆరంగేట్రానికి ఇదే సరైన సమయం అని చాలా మంది భావిస్తున్నారు.
Most Recommended Video
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?