PS1 Movie: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కోసం మరోసారి ముందుకు స్టార్లు!

సౌత్‌ సినిమా సత్తాను మరోసారి దేశవ్యాప్తంగా చూపించడానికి సిద్ధమవుతోంది ‘పొన్నియిన్‌ సెల్వన్‌ – 1’. మణిరత్నం మానసపుత్రికగా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 30న విడుదలవుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం ఉంది. వీరికితోడుగా మరికొంతమంది స్టార్లు సినిమా కోసం ముందుకు వస్తున్నారని సమాచారం. అయితే సినిమాలో నటించకపోయినా, గళమిచ్చి సినిమాలో భాగం కావడానికి సిద్ధమవుతున్నారట.‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా నేపథ్యం ప్రకారం, మణిరత్నం గతంలో తీసిన సినిమాల ప్రకారం చూస్తే..

ఈ సినిమా నేపథ్యంలో ఓ వాయిస్‌ వినిపించాలి. అంటే సినిమా కథను, సన్నివేశాల్ని కలపడానికి ఓ వాయిస్‌ అవసరం. దాని కోసం ప్రతి ఇండస్ట్రీలో స్టార్‌ హీరోను భాగం చేయాలని అనుకుంటున్నారట. దీని కోసం ఇప్పటికే కమల్‌ హాసన్‌ను సంప్రదించారని టాక్‌ వినిపిస్తోంది. తమిళంలో కమల్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పించాలని అనుకుంటున్నారట. ఒకవేళ అదే జరిగితే తెలుగులో వాయిస్‌ ఇచ్చేది చిరంజీవే అని అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎందుకంటే మణిరత్నం, సుహాసినిలకు చిరంజీవి మంచి స్నేహితుడు.

దాంతోపాటు ఇలాంటి సినిమాలను సపోర్టు చేయడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ చెప్పొచ్చు అని అంటున్నారు. అలాగే హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ చెబుతారు అని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌ – 1’లో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రధారులు. లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ నిర్మిస్తున్నాయి.

చోళ రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదలవుతుంది. రెండో భాగం సంగతి ఇంకా ప్రకటించలేదు. టీజర్‌ను తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, మలయాళంలో మోహన్‌ లాల్‌, కన్నడలో రక్షిత్‌ శెట్టి, తమిళంలో సూర్య విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus