ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం కావొచ్చు.. అయితే సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ అంటే ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తెలుగు సినిమాకు ఓ ఎమోషన్. ధైర్యానికి కేరాఫ్ అడ్రెస్. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, టాలీవుడ్‌లో కానీ, అభిమానుల్లో కానీ ఒకటే విషయం అనిపిస్తోంది. కృష్ణ అంత్యక్రియను సాధారణ వ్యక్తిలా మహా ప్రస్థానంలో నిర్వహించడమేంటి అని. ఎందుకంటే సెలబ్రిటీలు, ముఖ్యంగా అగ్ర నటుల అంత్యక్రియలను సొంత ప్రాంతంలో నిర్వహిస్తూ ఉంటారు.
అయితే కృష్ణ అంత్యక్రియలు మాత్రం అలా జరగలేదు. మొత్తం అభిమానగణాన్ని, దేశ సినీ పరిశ్రమను శోకంలో ముంచి, స్వర్గంలోని తన స్నేహితులను కలవడానికి వెళ్లిపోయిన కృష్ణకు ప్రత్యేకంగా సొంత ప్రాంతంలో నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే కృష్ణకు, మహేష్‌బాబు నగరం చాలా స్థలాలు ఉన్నాయి. పద్మాలయ స్టూడియో సమీప ప్రాంతం, మహేశ్వరం దగ్గర ఉన్న స్థలాల గురించి కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఎక్కడో ఓ చోట ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన స్మారకం ఏర్పాటు చేస్తే బాగుండేది అంటున్నారు.
టాలీవుడ్‌లో గతంలో చాలామంది అగ్ర నటులకు వాళ్ల కుటుంబసభ్యులు సొంత ప్రాంతాల్లో అంత్యక్రియలు నిర్వహించి స్మారకాలను ఏర్పాటు చేసిన విషయాలను కృష్ణ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ నటులు ఎవరు అనేది ఇక్కడ ప్రస్తావించడం పద్ధతి కాదు. అయితే వీటినే సోషల్ మీడియాలో చర్చకు తీసుకొస్తున్నారు. మరికొందరు అయితే విజయనిర్మలే ఉండి ఉంటే కృష్ణ అంత్యక్రియల విషయంలో ఈ పరిస్థితి ఉండేది కాదు అని కూడా అంటున్నారు.
అయితే, అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏం చర్చ జరిగింది, ఎవరేమన్నారు, దానికి ఎవరు ఏం చెప్పారు అనే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ పక్కనపెడితే ఫైనల్‌గా జరిగినదే ఓకే అయ్యింది చెప్పాలి. ఈ ఆఖరి నిర్ణయం మహేష్ తీసుకున్నాడా.. ఆయన తీసుకొని ఉంటే ఇది బాధాకరం అని అభిమానులు బాధపడుతున్నారు. దీనిపై మహేష్ కుటుంబం ఏమన్నా వివరణ లాంటిది ఇచ్చి చర్చను ఆపేస్తుందేమో చూడాలి.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!