సికింద్రాబాద్ లో ఓన్ డ్రైవింగ్ చేస్తూ యాక్టివాను గుద్దేసిన సురేష్ బాబు!

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇవాళ ఉదయం సికింద్రాబాద్ లో తన స్వంత కారులో రాంగ్ రూట్ లో వెళ్తూ ఎదురుగా వస్తున్న యాక్టివాను గుద్దేశారట. యాక్టీవాపై సతీష్-దుర్గాదేవి మరియు వారి 3 ఏళ్ల కొడుకు ఉన్నారని.. వారు తీవ్ర గాయాలపాలయ్యారని తెలిసింది. సురేష్ బాబు కారును స్వయంగా నడుపుతుండడంతో ఆయన మీద కేస్ రిజిష్టర్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. త్వరలోనే ఆయన ఈ కేసు విషయమై కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

తెలివైన సురేష్ బాబు ఈ కేస్ ను కోర్ట్ లో నాననివ్వడు కాబట్టి ఈలోపు సెటిల్ మెంట్స్ జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా.. నిన్నమొన్నటివరకూ పలురకాల సమస్యలతో ఉక్కిరిబిక్కిరైన సురేష్ బాబు మళ్ళీ ఇలా పోలీసులు-కోర్టులు చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus