ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లు తెరవడం కుదరడం లేదు. ఏపీలో టికెట్ రేట్ల సమస్య, తెలంగాణాలో పర్మిషన్లు వచ్చినా కొన్ని సమస్యల వలన థియేటర్లు ఓపెన్ చేయలేదు. ఇలాంటి సమయంలో కొందరు దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ నిర్వహించి అక్టోబర్ వరకు సినిమాలను ఓటీటీలకు అమ్మొద్దని రిక్వెస్ట్ చేశారు. కానీ అలా జరగడం లేదు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆయన నిర్మించిన ‘నారప్ప’ సినిమాను ఓటీటీకు అమ్మేశారు.
ఈ నెల 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘నారప్ప’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు సినిమాను ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందో చెప్పారు. ‘అసురన్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘అసురన్’ రీమేక్ రైట్స్ అడిగినప్పుడు నిర్మాత కళైపులి థాను ఆయన కూడా నిర్మాతగా వ్యవహరిస్తానని సురేష్ బాబుకి చెప్పారట. దీంతో వీరిద్దరూ కలిసి రీమేక్ ను నిర్మించారు.
అయితే కళైపులి థాను నిర్మించిన ‘కర్ణన్’ రీమేక్ ను పాండమిక్ సమయంలోనే రిలీజ్ చేశారు. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చినా.. రెండు వారాల తరువాత సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లను మూసేశారు. దీంతో నష్టం వచ్చింది. అదే పరిస్థితి ‘నారప్ప’ విషయంలో రిపీట్ అవుతుందేమోనని.. ఆయనే స్వయంగా ‘నారప్ప’ డీల్ మాట్లాడారని.. ఆయన కూడా నిర్మాత కావడంతో కాదనలేకపోయానని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ఓటీటీలో సినిమాను విడుదల చేస్తామని చెప్పినప్పుడు వెంకీ కూడా బాధపడ్డారని చెప్పారు.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్