తేజ సినిమాపై అంత నమ్మకమా..?

కెమెరామెన్ నుండి దర్శకుడిగా మారిన తేజ తొలిరోజుల్లో వరుస విజయాలు అందుకున్నాడు.ఆ తర్వాత గేరు మారి బండి వెనుకబడింది. ఈ మధ్యకాలంలో అతడు చేసిన సినిమా ఒక్కటంటే ఒక్కటీ ఆశించిన ఫలితాన్ని తెచ్చిపెట్టలేదు. ఈ విషయాన్ని తేజ కూడా నిర్మొహమాటంగా పలు సందర్భాల్లో ఒప్పుకున్నాడు. సినిమా హిట్ అయితేనే నిర్మాతలు దర్శకుల మొహాలు చూసి మాట్లాడే రోజులివి. అలాంటిది దశాబ్ద కాలంగా హిట్ ముఖం చూడని తేజని దగ్గుబాటి వారి తెగ నమ్ముతుండటం విశేషం.’అహం’ సహా ఒకటి రెండు సినిమాలను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని అనుకున్న తేజ ఎట్టకేలకు రానాతో సినిమా అనౌన్స్ చేసి ఇటీవల పట్టాలెక్కించాడు.

తేజ లిఫ్ట్ ఇచ్చిన కాజల్ ఈ సినిమాలో నటిస్తోంది. రానా షూటింగ్ స్పాట్ లో దిగిన ఓ ఫోటో తీసి తేజ సినిమా గురించి ఇప్పుడేం అడగొద్దంటూ పోస్ట్ చేశాడు. అంటే పాయింట్ ఏమిటన్నది బయటకు పొక్కకూడదనేగా. మరోవైపు కొంతకాలంగా ఒకటి రెండు రీమేక్ లు, ప్రెజెంటర్ గా మరికొన్ని సినిమాలు చేస్తూ స్ట్రెయిట్ చిత్రాల నిర్మాణాన్ని పక్కన పెట్టిన సురేష్ బాబు ఈ సినిమాని నిర్ముస్తుండడం చర్చనీయంగా మారింది. తేజ తక్కువ బడ్జెట్ లో తీస్తానని కమిట్ అయ్యాడనుకున్నా కాజల్ ఫాన్సీ రేట్ తెలిసిందేగా. రెండు కోట్లు ముట్టందే సెట్లో అడుగుపెట్టదు. ఇన్ని చిక్కులు ఉన్నా దగ్గుబాటి వారు ఈ సినిమా చేస్తున్నారంటే తేజపై అంత నమ్మకమేమిటో మరి..!

https://www.youtube.com/watch?v=kugg8u4eNuw

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus