గత కొంతకాలం నుంచి తెలుగు సినిమాలు తమిళ సినిమాలు విడుదల విషయంపై చిన్నపాటి వివాదం తలెత్తిన సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా సంక్రాంతికి సినిమాలు పెద్ద ఎత్తున విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో మొదటగా తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చిన అనంతరం ఇతర భాష సినిమాలకు ప్రాధాన్యత కల్పించాలని తెలుగు నిర్మాత మండలం నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఈ నిర్ణయం పై ఇప్పటికే ఎంతో మంది నిర్మాతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
తాజాగా సీనియర్ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం సరైనది కాదన్నట్టు ఈయన మాట్లాడారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ఇతర భాష చిత్రాలను ఎవరు ఆపలేరని సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడుతాయని ఈయన వెల్లడించారు. తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి మన సినిమాలను ఏ భాషలో కూడా చులకనగా చూడలేదు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలో చెన్నైలో కూడా చిన్న సినిమాలకు కాస్త ఇబ్బంది ఏర్పడి ఉంది.ఆయనప్పటికీ ఈ సినిమా విడుదలకు థియేటర్స్ ఇచ్చారు ఒకవేళ సినిమా బాగుంటే మరికొన్ని థియేటర్స్ లో రన్ అవుతుంది లేదంటే మరుసటి రోజు సినిమాని తొలగిస్తారు. సినిమా అనేది ఒక బిజినెస్ అంతే ఇక్కడ ఎవరి ఇష్టం వారిది
కవేళ సినిమా ఆడుతుంది అనే నమ్మకం ఉంటే ఎక్కువ థియేటర్స్ ఇస్తారు.అంతేకానీ అది ఏ భాష చిత్రమని ఎవరు చూడరని మన తెలుగు సినిమాలు కూడా ఇతర భాషలలో విడుదలై అక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయని ఈ సందర్భంగా సురేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!