Suriya: అత్యుత్వాహం ప్రదర్శించిన కెమెరామెన్స్.. అసహనం వ్యక్తం చేసిన సూర్య?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో నటుడు సూర్య ఒకరు.ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మాత్రమే కాకుండా తెలుగులో కూడా అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈయన తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఇక్కడ కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. సూర్య విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు.

తాజాగా సూర్య వాడీవాసల్ అని సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్న సూర్య తాజాగా ఈ సినిమా షూటింగుకు విరామం తీసుకుని తన కుటుంబంతో కలిసి ఆ సమయాన్ని గడిపారు. ఈ క్రమంలోనే సూర్య తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబైలో సందడి చేశారు. ఈ క్రమంలోనే ముంబైలో మీడియా కంటపడిన సూర్య ఫ్యామిలీని ఒక్కసారిగా మీడియా చుట్టుముట్టారు.

ఈ విధంగా కెమెరాలు చుట్టుముట్టడంతో కెమెరామెన్స్ పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూర్య తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాస్టియనల్ వోర్లీ హోటల్ కు వెళ్లారు.ఈ హోటల్ నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో మీడియా చుట్టుముట్టడంతో సూర్య జ్యోతిక ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

మీడియా అత్యుత్సాహం కనపరుస్తూ తన పిల్లల ఫోటోలను కూడా తీయడానికి ప్రయత్నం చేశారు. అయితే పిల్లల ఫోటోలు తీయవద్దు అంటూ సూర్య కెమెరామెన్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కెమెరాకు తన చేతిని అడ్డుపెట్టి మా పిల్లల ఫోటోలు వద్దు ప్లీజ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus