సూర్య హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఈటి’ (ఎవరికీ తలవంచడు)’. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలవుతుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నాయి.
ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం
1.26 cr
సీడెడ్
0.65 cr
ఉత్తరాంధ్ర
0.45 cr
ఈస్ట్
0.23 cr
వెస్ట్
0.20 cr
గుంటూరు
0.35 cr
కృష్ణా
0.30 cr
నెల్లూరు
0.18 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.62 cr
‘ఈటి’ చిత్రానికి తెలుగు రాష్టాల్లో రూ.3.62 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.3.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ‘పెద్దన్న’ చిత్రం నష్టపోయిన తెలుగు బయ్యర్స్ కు ‘ఈటి’ హక్కులను ని కాంపెన్సేషన్ గా ఇచ్చారు. అయితే తెలుగులో బుకింగ్స్ అంత ఆశాజనకంగా లేవు. రేపటి నుండీ ‘రాధే శ్యామ్’ థియేటర్లలో విడుదల కాబోతుంది కాబట్టి.. ‘ఈటి’ పరిస్థితి ఏంటి అనేది ప్రస్నార్ధకంగా మారింది.
పైగా తెలుగులో సూర్య మార్కెట్ చాలా వరకు డల్ అయిపోయింది. ఒకప్పుడు అతని సినిమాలకు రూ.10 కోట్ల నుండీ రూ.15 కోట్ల వరకు బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు 5 రెట్లు పడిపోయింది. మరి ఈ మూవీ ఫుల్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి..!