ET Review: ఈటీ-ఎవరికీ తలవంచడు సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 10, 2022 / 01:22 PM IST

“ఆకాశమే నీ హద్దురా, జై భీమ్” లాంటి ఒటీటీ బ్లాక్ బస్టర్స్ అనంతరం సూర్య నటించగా దాదాపు రెండున్నరేళ్ల తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రం “ఎవరికీ తలవంచడు”. సినిమా టైటిల్ ను కనీసం తెలుగులోకి సరిగా అనువదించకుండానే సినిమాను అనువదించిపడేశారు నిర్మాతలు. మరి ఈ అనువాద చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: లాయర్ కమ్ చురుకైన యువకుడు కృష్ణమోహన్ (సూర్య). చిన్నప్పుడే సొంత అక్కను కోల్పోవడంతో.. ప్రతి అమ్మాయిని తన సొంత చెల్లిగా చూసుకుంటూ వారి క్షేమం కోసం పరితపిస్తుంటాడు. ఈ క్రమంలో తన ఊర్లో కొంతమంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని, యాక్సిడెంట్ కారణంగా చనిపోతుంటారు.

ఈ అమ్మాయిల బలవంతపు హత్యలకు కారణం ఎవరు? అనేది వెతకడం మొదలెట్టిన కృష్ణమోహన్ కు కొన్ని నమ్మలేని నిజాలు తెలిసొస్తాయి.

ఇంతకీ ఏమిటా నమ్మలేని నిజాలు? అసలు ఈ వరుస బలవంతపు హత్యల వెనుక ఉన్నదెవరు? అనేది “ఎవరికీ తలవంచడు” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా సూర్య ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తాడు. ఈ చిత్రంలోనూ చురుకైన యువకుడిగా, చిన్నతనంలోనే అక్కను కోల్పోయిన తమ్ముడిగా, లాయర్ గా భిన్నమైన షేడ్స్ ను చక్కగా పోషించాడు సూర్య.

ప్రియాంక మొదటిసారి కాస్త నటించడానికి ప్రయత్నించింది కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అందంగా కనిపించినప్పటికీ.. నటిగా మాత్రం ఆమె డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది. ఈ విషయాన్ని ఆమె త్వరగా గుర్తిస్తే మరింతకాలం హీరోయిన్ గా కొనసాగే అవకాశాలున్నాయి.

ప్రతినాయక పాత్రలో వినయ్ రాయ్, తండ్రి పాత్రలో సత్యరాజ్, తల్లిగా శరణ్య తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: డి.ఇమ్మాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ బాగున్నాయి. ఇమ్మాన్ మాస్ ట్యూన్స్ & బ్యాగ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ ప్రొడక్షన్ డిజైన్ ను ఎలివేట్ చేసింది.

అయితే.. దర్శకుడు పాండిరాజ్ రాసుకున్న కథ-కథనంలో సత్తువ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. నిజానికి ఈ థీమ్ 2022లో తీయాల్సిన సినిమా కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్ తెలుగు నేటివిటీకి కనెక్ట్ అయ్యేలా లేకపోవడం, క్లైమాక్స్ 20 నిమిషాల సెంటిమెంటల్ సీక్వెన్స్ మరీ సాగడం, చివరిలో సరైన జస్టిఫికేషన్ లేకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని మైనస్ పాయింట్లున్న ఈ సినిమాను కేవలం అమ్మాయిల మరియు ఫ్యామిలీ సెంటిమెంట్స్ బేస్ చేసుకొని రాసుకోవడం ప్రేక్షకులకు మింగుడుపడడం కష్టం.

కొన్ని కాన్సెప్ట్స్ సమాజానికి అవసరమే.. కానీ ఆ చెప్పే విధానం కూడా బాగుండాలి. ఆ విషయాన్ని పాండిరాజ్ కాస్త సీరియస్ గా తీసుకొని ఉంటే “ఎవరికీ తలవంచడు” కమర్షియల్ గా హిట్ అయ్యేదేమో. సో, కథకుడిగా, దర్శకుడిగా పాండిరాజ్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

విశ్లేషణ: సూర్య నటన, మాస్ ఎలివేషన్స్, కొన్ని యాక్షన్ బ్లాక్స్, డి.ఇమ్మాన్ సంగీతం తప్పితే సినిమా మొత్తానికి చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు. సో, సూర్య ఫ్యాన్స్ & సెంటిమెంట్ తో పీక్ ను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus