Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!
- May 27, 2026 / 11:09 PM ISTByPhani Kumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) వరుస ఫ్లాపుల తర్వాత ‘వీరభద్రుడు’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. వాస్తవానికి ఇందులో సూర్య ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ లాంటిదే చేశాడు.
Suriya
కానీ ముందు నుండి ఇది సూర్య హీరోగా రూపొందిన సినిమాగా ప్రచారం అవ్వడం, అలాగే కొన్ని సీక్వెన్స్ లు వర్కౌట్ అవ్వడం వల్ల.. బాక్సాఫీస్ వద్ద బాగానే గట్టెక్కేసింది అని చెప్పాలి. ఏదైతేనేం ‘వీరభద్రుడు’ సక్సెస్ క్రెడిట్ సూర్యకే చెందుతుంది కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీ.

ఇక ‘వీరభద్రుడు’ ఇచ్చిన సక్సెస్ జోష్ తో సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం తన 47వ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు సూర్య. మలయాళంలో ‘ఆవేశం’ లాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు జితు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 2027 సంక్రాంతి కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్టుని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.మరోవైపు తన 48వ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు సూర్య.
‘జై భీమ్’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాని అందించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. ఇటీవల దర్శకుడు చెప్పిన ఫైనల్ నరేషన్ సూర్యకు బాగా నచ్చడంతో సూర్య ఓకే చెప్పేశాడు. సూర్యకి హోమ్ బ్యానర్ లాంటి ‘జగరం స్టూడియోస్’ పై ఈ చిత్రం రూపొందనుంది.ఈ ఏడాది సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం. 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ ను శరవేగంగా నిర్వహించనున్నారు.
ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?
















