Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?
- May 27, 2026 / 10:50 PM ISTByPhani Kumar
‘దృశ్యం’ సీక్వెల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Drishyam 3 Collections
‘దృశ్యం’ సూపర్ హిట్ అయ్యింది. ‘దృశ్యం 2’ కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఇండియా వైడ్ బాగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ‘దృశ్యం 3′(Drishyam 3) కూడా రూపొందింది. అయితే ఈసారి వెంకటేష్ తో కాకుండా మోహన్ లాల్ తో చేసిన మలయాళం వెర్షన్ నే నేరుగా తెలుగులోకి డబ్ చేసి మే 21న విడుదల చేశారు.

మొదటి రోజు ‘దృశ్యం 3’ కి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సూపర్ హిట్ సీక్వెల్ కాబట్టి.. మొదటి నుండి హైప్ ను సొంతం చేసుకున్న సినిమా కాబట్టి..టాక్ తో సంబందం లేకుండా మొదటి వీకెండ్ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ వీక్ డేస్ లో మాత్రం డౌన్ అయ్యాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 1.79 cr |
| సీడెడ్ | 0.25 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.25 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 3.29 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 0.14 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 3.43 cr(షేర్) |
‘దృశ్యం 3’ చిత్రం తెలుగు వెర్షన్ కి రూ.3.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.43 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.6.20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.57 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ ఛాన్స్..లు అయితే ఉన్నాయి.
రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో
















