Kanguva: లేట్ అయినా మంచి రిలీజ్ డేట్ పట్టారు

  • June 28, 2024 / 11:16 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ,  స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ‘దేవర’ (Devara)  అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘దేవర పార్ట్ 1 ‘ పేరుతో రాబోతోంది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోవడం వల్ల అక్టోబర్ 10 కి వాయిదా వేశారు.

అయితే ఈసారి షూటింగ్ కొంచెం ముందుగా కంప్లీట్ అయిపోతుండటంతో సెప్టెంబర్ 27 కే రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సో ‘దేవర’ ప్రీ పోన్ కావడంతో ప్రస్తుతానికి అక్టోబర్ 10 ఖాళీగా ఉంది. దసరా టైం కాబట్టి.. అది కూడా మంచి డేట్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ డేట్ ని ఏ పెద్ద సినిమా ఆకుపై చేయలేదు. దీంతో సూర్య టీం ఆ అడ్వాంటేజ్ ని వాడుకోవాలని డిసైడ్ అయ్యింది. అవును సూర్య (Suriya) హీరోగా  ‘కంగువా’ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమా రూపొందింది.

‘సిరుతై’ శివ ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ తర్వాత ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేదు. టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. తెలుగులో ‘యూవీ క్రియేషన్స్’ వారు విడుదల చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సూర్య ‘కంగువా’ రిలీజ్ డేట్ పోస్టర్ ని పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus