Jr NTR: తారక్ లైనప్‌పై ఆ రోజు ఫుల్‌ క్లారిటీ వచ్చేస్తుందా..!

అభిమాన హీరో పుట్టిన రోజు వస్తోందంటే ఆ హుషారు వేరు. రాబోయే సినిమాల ఫస్ట్‌లుక్‌లు, పోస్టర్లు, టీజర్‌లు, పాటలు ఏదో ఒకటి వస్తాయి అని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. మరో రెండు రోజుల్లో తారక్‌ పుట్టిన రోజు రాబోతోంది. అయితే ఫ్యాన్స్‌ మాత్రం ఏమంత ఖుషీగా లేరు అంటున్నారు. కారణం ఎన్టీఆర్‌ నుండి ఈ నెల 20న వచ్చే అప్‌డేట్స్‌ ఏమంత ఆసక్తికరంగా ఉండవు అనేది వారి ఆలోచనట. దీంతో అందరి మబ్బు వదిలిపోయేలా బంపర్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేయాల్సిందే అంటున్నారు హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌.

తారక్‌ లైనప్‌ గురించి అందరికీ తెలిసిందే. వరుసగా సినిమాలు ఓకే చేసి పెట్టుకున్నాడు. కానీ ఆ వివరాలు ఫ్యాన్స్‌కు చెప్పడం లేదు. ఇప్పుడు పుట్టిన రోజు సందర్భంగా అయినా అలాంటి వివరాలు బయటికొస్తాయా? అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. ‘అరవింద సమేత’ – ‘ఆర్‌ఆర్ఆర్‌’ మధ్య నాలుగేళ్లు నలిగిపోయాయి. కనీసంలో కనీసంలో నాలుగు సినిమాలు మిస్‌ అయ్యారు ప్రేక్షకులు. ఆ లోటును భర్తీ చేయడానికి తారక్‌ వరుస సినిమాలు చేస్తాడని ఆశించారు.

కానీ కొరటాల శివ సినిమా ఇంకా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో తెలియడం లేదు. కథ విషంయలో మరోసారి కూర్చోవాలని తారక్‌ సూచించడంతో కొరటాల టీమ్‌ ఆ పనిలో ఉన్నారని అంటున్నారు. దీంతో ఆ సినిమాకు సంబంధించి లుక్‌లు, వీడియోలు వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత చేయబోయే సినిమా ప్రశాంత్‌ నీల్‌తో. దీని నుండి విషెష్‌ పోస్టర్‌ మాత్రమే వస్తుందంటున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ సినిమా లెక్క తేలలేదు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా అన్నారు కానీ దానిపై కూడా క్లారిటీ లేదు. ఈ పుట్టిన రోజున ఆ విషయంలో క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇవి కాకుండా అనూహ్యంగా వేరే ఎవరైనా ముందుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. తారక్‌ బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తాడని చాలా రోజుల నుండి చెబుతున్నారు. మరి దాని గురించి ఏమైనా చెప్పి సర్‌ప్రైజ్‌ చేస్తారా అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus