తెలుగు, తమిళ భాషల్లో భారీగా పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు కాగా గతేడాది సూర్య నటించి విడుదలైన ఆకాశమే నీ హద్దురా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే సినిమాల్లోకి రాకముందు సూర్య ఒక బట్టల దుకాణంలో పని చేయడం గమనార్హం. నటనపై పెద్దగా ఆసక్తి లేని సూర్య సినిమాల్లోకి రావాలని భావించలేదు. చదువు పూర్తైన తర్వాత సూర్య ఒక దుస్తుల ఎగుమతుల సంస్థలో పని చేశారు.
ఆ సంస్థలో సూర్య రోజుకు ఏకంగా 18 గంటల పాటు కష్టపడేవారు. అయితే అంత కష్టపడినా సూర్యకు నెలకు కేవం 736 రూపాయలు మాత్రమే వేతనంగా లభించేది. కష్టం ఎక్కువ కావడంతో పాటు వేతనం సరిపోకపోవడం వల్ల సూర్య నటుడిగా మారాలని అనుకున్నారు. ప్రముఖ నటుడు శివకుమార్ కొడుకు కావడంతో సూర్యకు సినిమాల్లో సులభంగానే అవకాశాలు దక్కాయి. అయితే సూర్య ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కలేదు. మెయిన్ హీరో రోల్స్ రాకపోవడంతో సూర్య కొన్ని సినిమాలలో సెకండ్ హీరో పాత్రల్లో సైతం నటించడం గమనార్హం.
ఆ తరువాత మెయిన్ హీరోగా నటించిన సినిమాలు హిట్ కావడంతో సూర్యకు క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎంతో కష్టపడిన తరువాత సూర్య సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగడంతో పాటు వరుస సినిమా ఆఫర్లతో బిజీ అయ్యారు. సినిమాల ఎంపిక విషయంలో సూర్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం సూర్య ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!