Surya Kiran: బాలకృష్ణ గారితో సినిమా చేయకపోవడానికి అదే కారణం!

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం నటుడిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్యకిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఇకపోతే అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ హీరోగా వచ్చిన సొంతం సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సూర్యకిరణ్ అనంతరం పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.

అయితే దర్శకుడిగా ఈయనకు ఏ సినిమాలు మంచి పేరు సంపాదించలేకపోయాయి. తద్వారా ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే ఈయన దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన సమయంలోనే నటి కళ్యాణిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఆర్థిక ఇబ్బందులు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య కిరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈయన తమిళం బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే

అయితే ఈ కార్యక్రమంలో కేవలం మూడు వారాలకు మాత్రమే ఈయన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. తనకు అవకాశాలు లేని సమయంలో బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకునీ తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని తనకంటూ మంచి క్రేజ్ ఏర్పడటమే కాకుండా డబ్బు కూడా వస్తుందనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లానని తెలిపారు. అయితే తను అనుకున్న విధంగా ఏమి జరగలేదని సూర్యకిరణ్ ఈ సందర్భంగా తెలిపారు.

అయితే అప్పట్లో బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ప్రకటించాను. అయితే కొన్ని కారణాలవల్ల ఆ సినిమా చేయలేకపోయానని తిరిగి బాలకృష్ణ గారు తనని కలవమని చెప్పినా నేను కలవలేకపోయానని ఈయన వెల్లడించారు.ప్రస్తుతం తాను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానని అది పూర్తిగా గానే తానే వెళ్లి బాలకృష్ణ గారిని కలుస్తానని ఈ సందర్భంగా సూర్య కిరణ్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus