‘బిగ్ బాస్4’ మొదలైన వారం రోజులకే కంటెస్టెంట్ సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఇతను దర్శకుడైనప్పటికీ.. సోషల్ మీడియాలో ఇతనికి ఎక్కువ క్రేజ్ లేని కారణంగా నామినేషన్లో ఉన్నప్పుడు ఓట్లు పడలేదని క్లియర్ గా స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. ‘బిగ్ బాస్’ షో మొదలైనప్పటి నుండీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను టీవీ ఛానెల్స్ వారు ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 4 కు కూడా అదే తరహా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
ఇక సూర్య కిరణ్ కూడా రకరకాల టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తన ‘బిగ్ బాస్’ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన సినీ కెరీర్లో 10కోట్ల వరకూ పోగొట్టుకున్నట్టు షాకింగ్ విషయాలను తెలియజేసాడు. సూర్య కిరణ్ మాట్లాడుతూ.. “సినీ ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళ వల్లే నేను మోసపోయాను. ‘ప్రొడక్షన్ హౌస్’ ను స్టార్ట్ చేసి 10కోట్ల పైనే పోగొట్టుకున్నాను. ప్రస్తుతం నా దగ్గర 60కి పైనే కథలు రెడీగా ఉన్నాయి.త్వరలోనే ‘సూత్రధారి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను.
త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాను. ఇక ‘బిగ్ బాస్4’ కు గాను నాకు మంచి పారితోషికమే దక్కింది. అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువగానే ఇచ్చారు ‘బిగ్ బాస్’ నిర్వాహకులు” అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అసలు ఎంత పారితోషికం అందుకున్నది మాత్రం చెప్పలేదు.
1
2
3
4
5
6
7
8
9
Tanish, Surya Kiran, Kalyani at Nuvvu Sarigama Nenu Padanisa Movie Opening Stills
10
11
12
13
14
15
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!