Surya Son Dev: కొడుకు సక్సెస్ చూసి సంతోషంలో సూర్య.. ఆ ఘనత సాధించడంతో?

  • April 22, 2024 / 04:24 PM IST

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో సూర్య (Suriya) ఒకరు. తాజాగా హీరో సూర్య కొడుకు దేవ్ కు సంబంధించిన ఒక స్పెషల్ ఈవెంట్ లో కనిపించగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సూర్య కొడుకు దేవ్ కరాటేలో శిక్షణ తీసుకోవడంతో పాటు అందులో బ్లాక్ బెల్ట్ సాధించడం గమనార్హం. ఈ అవార్డ్ ప్రధానోత్సవానికి సూర్య స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

కొడుకు సక్సెస్ ను చూసి సూర్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సూర్య కళ్లను చూసిన నెటిజన్లు కొడుకు సక్సెస్ చూసి సూర్య తండ్రిగా ఎంతో గర్వపడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పిల్లలందరూ స్టేజ్ పై నుంచి వెళ్తున్న సమయంలో కొడుకును అలానే చూస్తూ సూర్య ఉండిపోవడం ఆయన కెరీర్ లో గ్రేట్ మూమెంట్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సూర్య బ్లాక్ బెల్ట్ సాధించిన ఇతర విద్యార్థులను సైతం మెచ్చుకుని మంచి మనస్సును చాటుకున్నారు. సూర్య కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ హీరో ఫోకస్ అంతా సినిమాలపై ఉంది. కంగువా సినిమాతో సూర్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించాల్సి ఉంది. సూర్య నటించి డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన సినిమాలు హిట్ గా నిలిచినా మిగతా సినిమాలు మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.

సిరూతై శివ డైరెక్షన్ (Siva) లో కంగువా (Kanguva) సినిమా తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రావడంతో పాటు రిలీజ్ డేట్ గురించి స్పష్టత రానుంది. కంగువా మూవీ బడ్జెట్ 500 కోట్ల రూపాయలు అని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కంగువా సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా సోలో రిలీజ్ డేట్ దక్కితే ఈ సినిమా రేంజ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus