Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

తెలుగు హీరోలనే కాదు, తమిళ, మలయాళ హీరోలను కూడా బాగా హ్యాండిల్‌ చేయగలడు అని పేరు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). ఆ ఇమేజ్‌తోనే ఇప్పుడు సూర్య (Suriya) హీరోగా ఓ సినిమాను ఇటీవల ప్రారంభించుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా చాలా పుకార్లు వినిపిస్తూ వచ్చాయి. ఈ సినిమాను ఓ బయోపిక్‌ అని, దానికి ఎమోషనల్ టచ్‌ ఇచ్చి సినిమా చేయబోతున్నారు అని ఆ వార్తల సారాంశం.

Suriya, Venky Atluri

అయితే ఇప్పుడు ఆ వార్తల్ని దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) కొట్టిపారేశాడు. అయితే గతంలో ఆ ఆలోచన అయితే చేశామని తెలిపారు. వెంకీ అట్లూరి – సూర్య.. ఈ కాంబినేషన్‌ ఆలోచన ఇప్పటిది కాదు. రెండేళ్లుగా నడుస్తోంది అని చెప్పొచ్చు. నిర్మాత నాగవంశీ ఈ ప్రయత్నాల్లో చాలా నెలల నుండే ఉన్నారు. ఆ సమయంలో ఈ సినిమా కోసం మారుతి 800 కారు రూపకర్త సంజయ్‌ గాంధీ లైఫ్‌ స్టోరీని తీసుకుంటున్నారు అని వార్తలొచ్చాయి. ఈ కథ గురించి సూర్య (Suriya) , వెంకీ పలు దఫాలు కథా చర్చలు కూడా జరిపారు.

కానీ గత సినిమాల ఫలితాలు, వాటి జోనర్ల కారణంగా ఆ కథతో అక్కడితో వదిలేశారట. ఇప్పుడు మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ కొత్త కథలో సూర్య (Suriya) .. ఫ్యామిలీ పర్సన్‌గా, లవర్‌ బాయ్‌గా కనిపిస్తాడట. ‘గజని’ సినిమాలో సంజయ్‌ రామస్వామి ఉంటాడు కదా.. అచ్చంగా అలాంటి వైబ్‌ వచ్చే పాత్రను సూర్య కోసం రాశారట. దర్శకుడు వెంకీ అట్లూరి. దానికి సూర్య (Suriya) ఓకే అనడంతోనే ఈ సినిమా మొదలైంది అని చెప్పాడు.

మరి సంజయ్‌ గాంధీ బయోపిక్‌ ఎందుకు వద్దనుకున్నారు అంటే.. అప్పటికే సూర్య వరుస బయోపిక్స్‌, చరిత్ర బేస్డ్‌ కథలు చేసి ఉండటంతో ఒకే స్టైల్‌ కథలు వద్దు అనుకున్నారట. అందుకే కథ మార్చాను అని వెంకీ అట్లూరి చెప్పారు. చూడాలి మరి చాలా రోజుల తర్వాత సూర్య మళ్లీ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించబోతున్నాడు.

 అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూమన్‌ కదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus