భారతీయ సినిమాలు చైనాకు వెళ్లడం కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా అక్కడికి వెళ్లి సత్తా చాటి వచ్చాయి. అయితే వాటిలో బాలీవుడ్ సినిమాలే ఎక్కువ. తాజాగా మరో సినిమా చైనా వెళ్లడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నుండి థియేటర్లలో విడుదలైన ఆఖరి సినిమా కావడం విశేషం. అవును ‘చిచ్చోరే’ చైనాకు తీసుకెళ్తున్నారు. వచ్చే జనవరి 7న ఈ సినిమాను చైనాలో రిలీజ్ చేస్తారట.
చైనాలో బాలీవుడ్ సినిమాలు విడుదలై మంచి విజయాలు అందుకున్నాయని చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా వినిపించే బాలీవుడ్ సినిమా పేరు ‘దంగల్’. ఈ సినిమా అక్కడ సుమారు ₹1000 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఆ తర్వాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో మన సినిమాలు ఏవీ అక్కడికి వెళ్లలేదు. కరోనా తర్వాత తొలిసారిగా వెళ్తున్న సినిమా ‘చిచ్చోరే’నే కావడం గమనార్హం. అయితే ఎన్ని స్క్రీన్లలో విడుదల చేస్తారు, ఎలాంటి ఫలితం వస్తుందనేది చూడాలి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకుడు. ఈ సినిమాలో తెలుగు నటుడు నవీన్ పొలిశెట్టి కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకుడు. సుమారు ₹50 కోట్లతో రూపొందిన ఈ సినిమా ₹200 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం (హిందీ)గా పురస్కారం కూడా దక్కింది.