యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి రెండు నెలలు దాటిపోతుంది. ఈ కేసులలో సి ఐ డి మరియు ఈడీ విచారణ కొనసాగుతుంది. సుశాంత్ మరణంతో సంబంధం ఉందని భావిస్తున్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. ఇక సుశాంత్ తో సన్నిహిత సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ సుశాంత్ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సుశాంత్ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన అనిల్ ఆదివాసీ ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ రియాతో ఆయనకున్న సంబంధాలు, సుశాంత్ మనస్తత్వం, ఆయన కోరికలు మరియు లక్ష్యాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
కాగా రియా రాకతో సుశాంత్ జీవితంలో ఇబ్బందులు మొదలయ్యాయని ఆయన చెప్పారు. రియా వస్తూనే సుశాంత్ టీమ్ ని మార్చివేశారు. సుశాంత్ జీవితంపై ఆమె పూర్తి ఆధిపత్యం చెలాయించేది. ఇక సుశాంత్ పెద్ద పెద్ద కలలు కనేవాడు. ఆయనకు చంద్రమండలంపైకి ప్రయాణించాలనే కోరిక బలంగా ఉండేది. ఆయన కోరికలు, లక్ష్యాలు చూసి చుట్టూ ఉన్నవారు అసూయపడేవారు. ఎంతో మంచి స్వభావం కలిగిన సుశాంత్ అనాధ శరణాలయాలకు అన్నదానం చేసేవారు.
ఒకసారి షూటింగ్ లేటవ్వడంతో నేను నిద్రపోయాను. నా పరిస్థితి అర్థం చేసుకొని సుశాంత్ స్వయంగా కారు నడుపుకొని ఇంటికి వెళ్లారు అన్నారు. కాగా డ్రైవర్ అనిల్ ఆదివాసి చెప్పిన విషయాలలో అతి ముఖ్యమైనది. సుశాంత్ కి మరణం అంటే భయం అట. జీవితాన్ని అందంగా గడపాలని కోరుకునేవారట. ఇక ఆయనలో ఎప్పుడూ డిప్రెషన్ ఛాయలు చూడలేదని ఆయన చెప్పారు.