Sushant Singh Rajput: మరణించి ఏడాదైనా తేల్చిందేంటి?

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందరిని షాక్ కు గురి చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. సుశాంత్ మరణించి నేటికి ఏడాది పూర్తయ్యింది. బాంద్రాలోని తన ఫ్లాట్ లో ఉరి వేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఆ కేసు సీబీఐ వరకు వెళ్లినా కూడా సుశాంత్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందనే అనుమానాలకు అసలు సమాధానం ఇంకా దొరకలేదు.

నేడు మొదటి వర్థంతి కావడంతో అభిమానులు సుశాంత్ ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. అతని చిన్ననాటి ఫొటోలతో పాటు అతను చేసిన సినిమాలు సెలబ్రెటీలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సుశాంత్ పేరు ట్రెండ్ అవుతోంది. గత ఏడాది ఎంతోమంది ప్రముఖులు కరోనా వల్ల మరణించారు. ఆ ఘటనల నడుమ సుశాంత్ సూసైడ్ ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది.

ముమ్మాటికీ నెపోటీజమ్ వలనే సుశాంత్ ప్రాణాలు వదిలినట్లు అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. 34 ఏళ్ళ సుశాంత్ అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం చాలా బలమైనదే అయ్యి ఉంటుందని మీడియా కూడా లోతుగా విచారించింది. అతని మాజీ ప్రేయసి కూడా మరో కారణమని ఆరోపణలు వచ్చాయి. ఇదొక చీకటి రోజు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోనే సుశాంత్ స్నేహితుడైన సిద్దార్థ్ పితానిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ విచారణపై ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. దీంతో సుశాంత్ కేసు కూడా మిస్టరీగానే మిగిలిపోతుందేమో అనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus