Sushmita: సుస్మిత వేసుకున్న ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సుస్మిత కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. చిరంజీవి వారసురాలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతము ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గాను, అలాగే నిర్మాతగాను కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా సుస్మితకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల కోసం ఇటలీ వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సుస్మితకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది.వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో భాగంగా నిర్వహించినటువంటి మెహందీ వేడుకలలో సుస్మిత ధరించిన డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చూడటానికి చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నటువంటి ఈ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించడంతో నేటిజన్స్ ఈ డ్రెస్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈ డ్రెస్ ఖరీదు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సుస్మిత (Sushmita) ధరించిన ఈ గ్రీన్ కలర్స్ చూడటానికి కాస్త డిఫరెంట్ లుక్ అనిపించింది. దీనిని ఎవరా కఫ్తాన్ డ్రెస్ అని అంటారట. స్వచ్ఛమైన పట్టు వస్త్రాన్ని ఉపయోగించి ఈ డ్రెస్ ను తయారు చేస్తారు. హ్యాండ్ మేడ్ అంబ్రాయిడరీతో రిచ్ అండ్ క్లాసీగా సుస్మిత డ్రెస్ కనిపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ మృణాళిని రావు సుస్మిత కోసం స్పెషల్ గా డిజైన్ చేశారని తెలుస్తుంది. ఈ డ్రెస్ మనకు ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంది.

చూడటానికి చాలా సింపుల్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నటువంటి ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఈ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ. 1,79,200. స్మాల్ నుంచి ఎక్స్‌ట్రా లార్జ్ వరకు ఇదే ధర వర్తిస్తుంది. కానీ, డబుల్ ఎక్స్ఎల్ సైజు డ్రెస్ ధర మాత్రం రూ.1,97,120. ఒకవేళ మీకు 4 ఎక్స్ఎల్ సైజు డ్రెస్ కావాలి అనుకుంటే.. అందుకు మీరు రూ.2,15,040 చెల్లించాల్సిందే. ఇలా సుస్మిత ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఇన్ని లక్షల రూపాయలు అని తెలియడంతో నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus