హాట్ టాపిక్ గా మారిన హృతిక్ భార్య లవ్ స్టోరీ!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్ ఖాన్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తన సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లక్రితమే హృతిక్-సుసాన్ ఖాన్ లు విడిపోయారు. విడాకులు తీసుకొని వేరయ్యారు. అయితే పిల్లల కోసం అప్పుడప్పుడు కలిసి కనిపించేవాళ్లు. పిల్లలను తీసుకొని ట్రిప్ లకు జంటగా వెళ్లేవారు. విడాకుల తరువాత తమ మధ్య స్నేహాన్ని కొనసాగించారు. హృతిక్-సుసాన్ చిన్ననాటి స్నేహితులు..

ఆ స్నేహమే ప్రేమగా మారి, పెళ్లి కూడా చేసుకున్నారు. 2000లో వీరికి పెళ్లి జరిగింది. దాదాపు ప‌ద్నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న వీరు చివరికి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు సుసాన్ రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడం విశేషం. అతడి పేరు అర్స్లాన్ గోనీ. సుసాన్ నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోగా.. ఆమెకి విషెస్ చెప్పాడు అర్స్లాన్. ఇందులో లవ్ సింబల్స్, కిస్సింగ్ ఎమోజీలు ఉండడం..

ఈ పోస్ట్ కి సుసాన్ స్పందిస్తూ.. ‘మై ఎవ్రిథింగ్’ అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు తేల్చేశారు. లేటెందుకు పెళ్లి చేసుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus