టాలీవుడ్ ప్రేక్షకుల గుండెలు పగిలిన సందర్భాల్లో ప్రముఖ కథానాయిక సౌందర్య మరణం ఒకటి. నటిగా అందరి మనసుల్లో చెరగని ముద్రవేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు సౌందర్య. ప్రమాదవాశాత్తు ఆమె మృతిచెందిన విషయం తెలిసిందే. అలాంటామెతో అద్భుతమైన పాత్రలు చేయించిన ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో సౌందర్యపై తన అభిమానాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో కాస్త భావోద్వేగానికి గురయ్యారు ఆయన. ఆయన చెప్పిన మాటలు విని ప్రేక్షకులు కూడా అలాంటి భావనలోనే పడ్డారు.
సౌందర్య లాంటి గొప్ప నటి ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆమె చనిపోయిన తర్వాత టీవీల్లో ఆమె పాట వస్తే ఆఫ్ చేసేవాణ్ని. అంతలా ఆమె మృతి నన్ను కలచి వేసింది అని చెప్పుకొచ్చారు ఎస్వీ కృష్ణారెడ్డి. అంతేకాదు ఇప్పుడు అంతటి గొప్పపాత్రలు రాద్దామన్నా… పోషించడానికి తగిన నాయికలు లేరు అని కూడా చెప్పుకొచ్చారు కృష్ణారెడ్డి. దీంతో షో అంతా ఒక్కసారిగా బరువుపెరిగినట్లు అనిపించింది. ఎస్వీకృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘రాజేంద్రుడు గజేంద్రడు’, ‘మాయలోడు’, ‘నెంబర్ 1’, ‘టాప్ హీరో’ లాంటి సినిమాల్లో సౌందర్య కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.
ఇవన్నీ హీరో నేపథ్య సినిమాలు, కమర్షియల్ సినిమాలే అయినా… హీరోయిన్ పాత్ర కూడా కీలకంగానే ఉంటుంది. ఫక్తు కమర్షియల్ సినిమాల్లోనూ హీరోయిన్ పాత్ర బలంగా ఉండొచ్చు ఆ సినిమాలు చెబుతాయి. అలాంటి పాత్రలు ఆమె బాగా చేస్తుందని ఆ పాత్రలకు వచ్చిన రెస్పాన్స్ చెబుతుంది.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?