అప్పుడు దేవికి ఛాన్స్ ఇచ్చినట్టే.. ఇప్పుడు మహతీ స్వరసాగర్ కు మెగాస్టార్ ఛాన్స్ ..!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. మిగతా స్టార్ హీరోలు.. యంగ్ హీరోల కంటే ఫాస్ట్ గా సినిమాలు చెయ్యడానికి వరుస ప్రాజెక్ట్ లు లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న మెగాస్టార్.. అటు తరువాత వినాయక్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్, అటు తరువాత మెహర్ రమేష్ తో ‘వేదాలం’ రీమేక్, అది పూర్తయ్యాక బాబీ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నారు.

ఇందులో మెహర్ రమేష్ తో చెయ్యబోతున్న ‘వేదాలం’ రీమేక్ కోసం మణిశర్మ కొడుకు అయిన మహతి స్వర సాగర్ ను చిరు సంగీత దర్శకుడిగా ఎంచుకోబోతున్నట్టు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాకి మహతి స్వర సాగర్ కూడా పనిచేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. అతని పనితనం నచ్చి.. మెగాస్టార్ ఛాన్స్ ఇస్తానన్నారట. దీంతో ‘వేదాలం’ రీమేక్ చెయ్యబోతున్న దర్శకుడు మెహర్ రమేష్ తో కూర్చొని ఓ ట్యూన్ ను కంపోజ్ చేసాడట మహతి. దీనిని మెగాస్టార్ కు వినిపించడానికి దర్శకుడు మెహర్ రమేష్ బెంగుళూర్ వెళ్లాడని తెలుస్తుంది.

అది నచ్చితే.. మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ‘ఛలో’ ‘భీష్మ’ వంటి చిత్రాలకు మంచి మ్యూజిక్ ఇచ్చిన అనుభవం మహతికి ఉంది. గతంలో దేవి శ్రీ ప్రసాద్ కు కూడా ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తరువాత దేవి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇప్పుడు మహతి విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందేమో చూడాలి.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus