ఈమధ్యకాలంలో పనికిమాలిన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో భీభత్సమైన హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డికి ఎంత సపోర్ట్ వచ్చిందో అదే స్థాయి నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే.. ఇండస్ట్రీలో ఉంటూ ఇప్పటివరకూ ఇండస్ట్రీని బేస్ చేసుకొని బ్రతుకుతూ, ఇండస్ట్రీ గురించే తప్పుగా మాట్లాడడం ఎంతవరకూ సమంజసం అనే విషయం చాలా మంది సీరియస్ అయ్యారు. అయితే.. శ్రీరెడ్డి కంటే ఇండస్ట్రీలో సీనియర్ అయిన స్వాతినాయుడు కూడా ఇటీవల తాను ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, ఎలా బాధపడింది, ఎలా బ్లూ ఫిలిమ్స్ ను తన సంపాదన మార్గం కోసం ఎన్నుకున్నది అనే విషయాలు స్పష్టం చెప్పింది.
అయితే.. స్వాతినాయుడు, శ్రీరెడ్డిల జీవితాలు దాదాపు ఒకే రీతిలో ఉన్నాయి. కానీ.. శ్రీరెడ్డితో కంపేర్ చేస్తే స్వాతినాయుడు కాస్త సెన్సిబుల్ గా మాట్లాడింది. శ్రీరెడ్డి స్థాయిలో బూతులు మాట్లాడుతూ, అసభ్య పదజాలంతో కాక నీతిగా నిజాయితీగా మాట్లాడింది. సదరు స్వాతినాయుడు ఇంటర్వ్యూ చూసినవాళ్ళందరూ ఆ శ్రీరెడ్డి కంటే స్వాతినాయుడు చాలా బెటర్ అంటున్నారు.