బన్నీతో నటించడానికి స్వాతి ఎందుకు నో చెప్పింది?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించాలని చాలా మంది హీరోయిన్స్ కోరుకుంటుంటారు. అటువంటిది కలర్స్ స్వాతికి ఆ అవకాశం వచ్చినప్పటికీ నో చెప్పింది. అవును ఇది నిజం. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా చెప్పింది. ఓ ఇంటర్వ్యూ లో స్వాతి మాట్లాడుతూ తన సినీ జర్నీ లోని అనేక ఆసక్తికర సంగతులు పంచుకుంది. “టీవీ షో చేస్తుండటం వల్ల మెడికల్ కాలేజీలో చాలా ఇబ్బందిపడ్డాను. కాలేజీ హాస్టల్ వదిలేసి బయట ఉండవలిసి వచ్చింది.” అని చెప్పింది.  తాను డబ్బింగ్ ఆర్టిస్టుగాగురించి స్వాతి చెబుతూ “జల్సా’ సినిమాలో ఇలియానా పాత్రకు డబ్బింగ్ చెప్పించేందుకు 30 మందిని ట్రై చేశారు. త్రివిక్రమ్ కి నచ్చలేదు. కొత్త వాయిస్ కావాలని నాతో డబ్బింగ్ చెప్పించారు.

అలాగే  ‘కథ స్క్రీన్ ప్లే అప్పల్రాజు’ సినిమాలో వర్మ కోరిక మేరకు సరదాగా ఒక పాటపడితే..  దేవిశ్రీ ప్రసాద్ వచ్చి “100 పర్సంట్ లవ్” లో పాడే ఆఫర్  ఇచ్చారు” ఇలా అనుకోకుండానే.. సింగర్ గా మారినట్లు తెలిపింది. ఇక అల్లు అర్జున్ అవకాశం గురించి స్పందిస్తూ.. “అల్లు అర్జున్  తొలి సినిమా ‘గంగోత్రి’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ను వదులుకున్నాను. ఎందుకంటే     ఎంసెట్ కౌన్సెల్సింగ్ పూర్తయి ఎంబీబీఎస్ లో ఫ్రీ సీట్ వచ్చింది. దీంతో చదువు మీద దృష్టిపెట్టాలనుకుని బన్ని సినిమాకు నో చెప్పాను” అని అసలు విషయం చెప్పింది. ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంపై స్వాతి స్పందిస్తూ.. “నటిగా అనేక సినిమాల్లో నిరూపించుకున్నాను. అయినా ఎందుకు ఆఫర్లు రావడం లేదో దర్శకనిర్మాతలనే అడగాలి”  అని స్వాతి పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus