Swathi: విడాకుల రూమర్స్ పై స్పందించి అసలు విషయాన్ని బయటపెట్టేసింది

స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి ని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 15 ఏళ్లకే మా టీవీలో ప్రసారమయ్యే ‘కలర్స్’ అనే షోకి యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఈమె చలాకీతనానికి చాలామంది ఫాన్స్ ఏర్పడ్డారు. అందుకే మీకు క్రేజీ సినిమాల్లో ఛాన్స్ లు లభించాయి.’డేంజర్’ ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘అష్టాచమ్మా’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమాలన్నీ హిట్లే. అటు తర్వాత వికాస్ వాసుని ప్రేమ వివాహం చేసుకుని విదేశాలకి చెక్కేసింది. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు గత ఏడాది ‘పంచతంత్రం’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే సాయి ధరమ్ తేజ్ తో సత్య అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. అయితే కొద్దిరోజులుగా స్వాతి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యిందని.

అందుకే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అందుకు కారణం.. స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో మ్యారేజ్ ఫొటోలను డిలీట్ చేయడమే అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. తాజాగా మంత్ ఆఫ్ మధు సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో స్వాతి కి విడాకులు గురించి ప్రశ్న ఎదురైంది. వాటికి ఆమె ‘ నేను చెప్పను ‘ అంటూ సమాధానం ఇచ్చింది. అక్కడ స్వాతి (Swathi) విడాకులు మేటర్ ను ఖండించింది లేదు. నేను చెప్పను అని ధైర్యంగా చెప్పింది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus