టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో ఒకరైన నిఖిల్ (Nikhil Siddharth) వేగంగా సినిమాల్లో నటించడం కంటే మంచి సినిమాల్లో నటించడంపై దృష్టి పెడుతున్నారు. నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఖర్చు విషయంలో నిర్మాతలు రాజీ పడటం లేదు. ఈ సినిమాలో యాక్షన్ సీన్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని దాదాపుగా 12 రోజుల పాటు ఈ యాక్షన్ సీన్ ను షూట్ చేశారని తెలుస్తోంది.
ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఫైటర్లతో పాటు 700 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొన్నారని భోగట్టా. నిఖిల్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో నిర్మాతలు సైతం నిఖిల్ సినిమాలకు జరుగుతున్న బిజినెస్ విషయంలో సంతోషిస్తున్నారు. నిఖిల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. నిఖిల్ పారితోషికం 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.
నిఖిల్ వేగంగా సినిమాలలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. నిఖిల్ కు కార్తికేయ2 (Karthikeya 2) సినిమాతో ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో సక్సెస్ సాధిస్తే నిఖిల్ కు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నిఖిల్ స్వయంభూ (Swayambhu) సినిమాలో ఇతర యాక్షన్ సీన్స్ కూడా స్పెషల్ గానే ఉండబోతున్నాయని తెలుస్తోంది.
నిఖిల్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉందని సమాచారం అందుతోంది. పిక్సల్ స్టూడియో సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో నిఖిల్ యుద్ధవీరుడిగా కనిపించనుండగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. స్వయంభూ మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.