నితిన్ (Nithin Kumar) హీరోగా రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ‘సై’ (Sye) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘శ్రీ భారతీ ఎంటర్ప్రైజెస్’ బ్యానర్ పై ఎ.భారతి ఈ చిత్రాన్ని నిర్మించారు. రగ్బీ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన తొలి తెలుగు సినిమా ఇది. నితిన్ సరసన జెనీలియా (Genelia) హీరోయిన్ గా నటించింది. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. ప్రదీప్ రావత్ (Pradeep Rawat) విలనిజం, కీరవాణి (M. M. Keeravani) బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నితిన్ నటన..
ఈ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించాయి అని చెప్పాలి. ముఖ్యంగా రాజీవ్ కనకాల (Rajiv Kankala) పాత్ర కూడా చాలా బాగా డిజైన్ చేశాడు రాజమౌళి. 2004 సెప్టెంబర్ 23 న రిలీజ్ అయిన ఈ సినిమా నేటితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఒకసారి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :
నైజాం | 2.85 cr |
సీడెడ్ | 1.01 cr |
ఉత్తరాంధ్ర | 1.21 cr |
ఈస్ట్ | 0.68 cr |
వెస్ట్ | 0.56 cr |
గుంటూరు | 0.67 cr |
కృష్ణా | 0.61 cr |
నెల్లూరు | 0.39 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.98 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
1.03 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 9.01 cr |
‘సై’ చిత్రం రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద రూ.9.01 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ సినిమా. బయ్యర్స్ కి రూ.4.01 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది.