రన్ టైం అయితే తగ్గిస్తున్నారు.. కానీ..?

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ఘనంగా విడుదల కాబోతుంది. అయితే 4 వారాల్లో విడుదల కాబోతుందన్న మాట. 250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. దర్శకుడు సురేంద్ర రెడ్డి వారి అంచనాల్ని ఏమాత్రం తగ్గించకుండా ‘సైరా’ ను తెరకెక్కిస్తున్నాడు.

ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ‘సైరా’ చిత్రం. విఎఫ్ఎక్స్ వర్క్స్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారట.అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రన్ టైమ్ ను ప్రాధమికంగా లాంచ్ చేశారట. మొదటి రష్ చూసుకున్నాక 2 గంటల 45 నిమిషాల నిడివి వచ్చినట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఇది కూడా ఎక్కువే అని భావించి… చిత్ర యూనిట్ సభ్యులు మరో సిట్టింగ్ వేసి మరింత నిడివి తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఫైనల్ రన్ టైమ్ ఎంత ఉంటుందనేది తెలియాల్సి ఉంటుంది. అయితే ఇది కూడా ఓ మహా వ్యక్తి జీవిత చరిత్ర కాబట్టి 3 గంటల నిడివి వచ్చినా… ఆశ్చర్యపడనక్కర్లేదు. కానీ ఆయన జీవితంలో హైలెట్ గా ఉన్న సన్నివేశాలనే కమర్షియల్ హంగులతో ఇరికిస్తున్నారా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus