మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తన తండ్రి డ్రీం ప్రాజెక్ట్ ను నిర్మించే భాద్యత రాంచరణ్ తీసుకున్నాడు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు చరణ్. స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తిచేసుకోవడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసిందని తాజా సమాచారం. ఇక విడుదలకు 22 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రమోషన్స్‌ని పూర్తిస్థాయిలో మొదలుపెట్టేసింది ‘సైరా’ టీం.
అందుతున్న సమాచారం ప్రకారం ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకని ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి సొంత ఊరు అయిన కర్నూలు జిల్లాలో నిర్వహించబోతున్నారట. కానీ అనుకోని విధంగా ‘సైరా’ కి ఇప్పుడో పెద్ద షాక్ తగిలేలా ఉందని చిత్ర యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికే ‘సైరా’ ను అక్టోబర్-02న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించేసారు. అయితే ఇప్పుడు 02నుండీ 08కి వాయిదా పడే అవకాశం ఉందట. దీనికి ముఖ్య కారణం.. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడమే అని తెలుస్తుంది. ఒకవేళ పూర్తయినా దాని ఫైనల్ కాపీ సిద్ధం చేయడానికి కూడా మరింత సమయం పెట్టే అవకాశం ఉందట. ఏదేమైనప్పటికీ ప్రమోషన్స్ మాత్రం చేస్తూనే ఉండాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఈ వార్త మెగా ఫ్యాన్స్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి ఈ విషయం పై ‘సైరా’ యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.