ఇప్పటివరకూ ఒక సినిమాను రిలీజ్ చేయాలంటే ఎగ్జామ్స్, ఎలక్షన్స్, వాతావరణం, వేరే పెద్ద సినిమాలు, క్రికెట్ వంటి విషయాలకు భయపడిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ కి భయపడుతున్నారు. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సినిమా విడుదలైన 28 లేదా 30 రోజుల్లో ఆన్ లైన్ లో సినిమాని విడుదల చేసేస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పెద్ద సినిమాలను.. భారీ రేట్లకు కొనడానికి భయపడుతున్నారు. ఇప్పుడు “సైరా నరసింహారెడ్డి” విషయంలోనూ అదే తరహా సమస్య తలెత్తింది. సినిమా విడుదలై 50 రోజులు పూర్తవుతున్న సందర్భంలో మెగా అభిమానులందరూ సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతుండగా.. అమెజాన్ ప్రైమ్ లో రేపు సినిమాను విడుదల చేయనుండడం ఒకింత బాధకు గురి చేస్తోంది.
సినిమా అనేది థియేటర్ లో చూడడం అనేది ఒక మంచి ఎక్స్ పీరియన్స్ లాంటిది. కానీ.. ఈమధ్య వచ్చిన అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వల్ల జనాలు థియేటర్లకి రావడం మానేశారు. సూపర్ హిట్ సినిమాలను కూడా నెల రోజుల లోపే ఆన్లైన్ లో ప్రసారం చేస్తుండడంతో జనాలు థియేటర్లకు రావడం పూర్తిగా తగ్గించేశారు. ఈ విషయం గత కొన్ని నెలలుగా డిస్ట్రిబ్యూటర్లను, థియేటర్లను ఇబ్బందిపెడుతూనే ఉంది. ఈ విషయమై కొందరు నిర్మాతలు ఫిలిమ్ ఛాంబర్ లో తమ గోడును వెళ్లగక్కుకున్నప్పటికీ.. పెద్దగా ఫలితం లేకపోయింది.
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!