‘సైరా’ రాకతో డైలమాలో పడ్డ ‘వెంకీమామ’ టీం!

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే… ఆ సినిమాకి దరిదాపుల్లో చిన్న సినిమాని రిలీజ్ చేయడానికి ఆ చిన్న సినిమా నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ‘సాహో’ చిత్రం విషయంలో ఇలాగే చాలా సినిమాలు త్యాగాలు చేసాయి. నాని ‘గ్యాంగ్ లీడర్’, వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో పెద్ద చిత్రం ‘సైరా’ విషయంలో కూడా ఇదే జరుగుతుందట. మెగాస్టార్ 151 వ చిత్రం గా తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం మామా అల్లుళ్ళు తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోబోతున్నారట.

విషయం ఏమిటంటే… విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్ 4 న విడుదల చేయాలనుకున్నారట. కానీ అక్టోబర్ 2 న ‘సైరా’ విడుదల కాబోతుండడంతో ‘వెంకీమామ’ టీం డైలమాలో పడిందట. ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కే రావాలా లేక ఓ వారం పోస్ట్ పోన్ చేసుకుని రావాలా అనే కన్ఫ్యూజన్ లో ‘వెంకీమామ’ టీం ఉన్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus