లేడీ కబీర్ సింగ్ లాంటి రోల్ నేను ఎప్పుడో చేశాను: తాప్సీ

ఈమధ్య బాలీవుడ్ మీడియాకి అక్కడి హీరోయిన్స్ ను “మీరు లేడీ అర్జున్ రెడ్డి లా యాక్ట్ చేయాల్సి వస్తే, ఏం చేస్తారు?” అని ఒక క్వశ్చన్ అడగడం సర్వసాధారణం అయిపోయింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సగానికి పైగా హీరోయిన్లు ఆశాకి చూపడం లేదనుకోండి. అయితే.. ఇదే ప్రశ్నను ఇటీవల తాప్సీని అడిగినప్పుడు మాత్రం మంచి క్రేజీ ఆన్సర్ చెప్పింది అమ్మడు. తాను లేడీ అర్జున్ రెడ్డి లాంటి రోల్ ఎప్పుడో చేశానని, జనాలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది.

అసలు విషయం ఏమిటంటే.. తాప్సీ గత ఏడాది “మన్మర్జియా” అనే సినిమాలో కాంట్రవర్సీయల్ రోల్ ప్లే చేసింది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్రను చాలా మంది తప్పుబట్టడమే కాక.. ఆ తరహా పాత్రను సెలక్ట్ చేసుకొన్నందుకు ఆను తూలనాడారు. ఆ సినిమాలో ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడలేకపోయి.. పెళ్ళైన తర్వాత కూడా ప్రియుడితో శారీరిక సంబంధం కంటిన్యూ చేసి.. ఆ విషయం భర్తకు తెలిసి విడాకులు తీసుకొనే ఒక ఇండిపెండెంట్ ఉమెన్ రోల్ ఆమెది. ఇదే విషయాన్ని ఆమె చెబుతూ… “లేడీ అర్జున్ రెడ్డి లాంటి పాత్ర నేను చేస్తే ఆడియన్స్ ఆదరించలేదు. ఈ ప్రేక్షకుల డబుల్ స్టాండర్డ్స్ నాకు అర్ధం కావడం లేదు” అని రివర్స్ లో ప్రేక్షకుల్ని తిట్టిపోసింది తాప్సీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus